స్కిన్‌ ఎలర్జీ.. గుండె సమస్యకు దారి తీయనుందా....?

New Update

మారుతున్న కాలానుగుణంగా మనలోనూ మార్పులు కనిపిస్తాయి. స్కిన్‌ ఎలర్జీలు రావడం కనిపిస్తాయి. అయితే ఇవన్నీ సాధారణ సమస్యల్లాగా అనిపించినప్పటికీ మీ గుండె బలహీనంగా ఉందని హెచ్చరించే సంకేతాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. మెయిన్‌గా 6 రకాల చర్మ సమస్యలు గుండె జబ్బులతో లింక్‌ ఉంటాయని అంటున్నారు. ఇంతకీ అవేంటో ఎన్ని రకాలో తెలుసుకుందాం...

lifestylecardiologists-say-that-certain-types-of-skin-problems-are-linked-to-heart-disease

1. సైనోసిస్

మీ చర్మం, పెదవులు, గోళ్లు నీలం రంగులో కనిపిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండె వైఫల్యం లేదా పుట్టుకతో వచ్చే గుండె లోపానికి సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య ఉన్నవారు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా రాబోయే గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయట పడవచ్చు.

2. క్లబ్బింగ్

చేతివేళ్లపైన గోళ్ల చుట్టుపక్కల చీము పట్టడం, నొప్పి కలగడం వంటి ఇబ్బందులను క్లబ్బింగ్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండటంవల్ల ఇలా జరుగుతుంది.ఈ పరిస్థితి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులవల్ల తలెత్తవచ్చు లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నా కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

3. కొవ్వు నిల్వలు

చర్మంపై కొవ్వు నిల్వలు పసుపురంగు గడ్డలుగా కనిపిస్తాయి. హై కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఈ సమస్య ఉంటుంది. అయితే తరచూ ఈ సమస్యలు తగ్గకుండా కంటిన్యూ అవుతుంటే మాత్రం గుండె జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

4. పెటెచియా

చర్మం ఉపరితలం కింద రక్తస్రావం జరిగినప్పుడు కనిపించే చిన్నపాటి ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలను పెటెచియాస్ అంటారు. ఇవి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‌కు సంకేతం కావచ్చు. గుండె కవాటాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల కూడా కలుగుతాయి.

5. ఓస్లర్ నోడ్స్

ఓస్లర్ నోడ్స్ అనేవి అరి కాళ్లు, చేతి వేళ్లపైన, అరిచేతుల్లో చిన్నపాటి గాయాల మాదిరిక కనిపంచే ఎరుపు రంగు మచ్చలు. ఇవి ఏవైనా గాయాలు కలిగినప్పుడు, ముళ్లు గుచ్చుకున్నప్పుడు నిలిచిపోయిన గాయాల మాదిరి కనిపిస్తుంటాయి. గుండె జబ్బుల ప్రమాద హెచ్చరికగా పరిగణించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు