Worm in Human Eye: కన్ను నుంచి మెదడులోకి వెళ్లిన పురుగు..! డాక్టర్లు షాక్..

ఓ వ్యక్తికి కంటి చూపు తగ్గి, కన్ను ఎర్రగా మారడం వంటి లక్షణాలతో పరీక్ష చేయగా, కంటిలో నుండి పురుగు బయటపడింది. శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించిన వైద్యులు పూర్తిగా వండని మాంసం తినడం వల్ల ఇది శరీరంలోకి ప్రవేశించి కంటికి చేరిందని తెలిపారు.

New Update
Worm in Human Eye

Worm in Human Eye

Worm in Human Eye: ఈ రోజుల్లో కంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువవుతున్నాయి. మనం ఎక్కువగా కంప్యూటర్‌లు, ఫోన్లు వాడటం కంటి సంబంధిత వ్యాధులకు ముఖ్య కారణం. స్క్రీన్ టైమ్ ఎక్కువవ్వడం, తగిన విశ్రాంతి లేకపోవడం వలన చూపు మందగించడం, కంటి ఎరుపు, చిరాకు వంటివి సాధారణంగా కనిపిస్తున్నాయి. కానీ ఓ వ్యక్తికి ఎదురైన విచిత్ర సంఘటన మాత్రం నిజంగా షాకింగ్‌గా ఉంది.

ఒక వ్యక్తికి కంటి చూపు తగ్గిపోవడంతో పాటు, కన్ను ఎర్రగా మారిపోయింది. మొదట అది కాంటాక్ట్ లెన్స్ వల్ల వచ్చిన ఇబ్బంది అని అనుకున్నాడు. కానీ పరిస్థితి మెరుగవకపోవడంతో డాక్టర్లను సంప్రదించాడు. పరీక్ష చేసిన వైద్యులు కంటిలో ఓ పురుగు కదులుతుండటాన్ని గుర్తించారు.

Also Read:ఫ్లైవనాయిడ్ల వినియోగంతో ఆరోగ్యం మెరుగు.. పరిశోధనలు ఏం చెపుతున్నాయో మీరూ తెలుసుకోండి!

కంటిలో పురుగు కదులుతూ..

అయితే ఈ వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడ్డాయి. ఆ వ్యక్తి ఎడమ కంటిలో లెన్స్, రెటీనా మధ్య ఉన్న జెల్లీ లాంటి పదార్థం చూసి ఆశ్చర్యపోయారు వైద్యులు. ఇంకా షాకింగ్ విషయమేంటంటే ఆ జెల్లీ లాంటి పదార్థంలో ఓ పురుగు కదులుతూ కనిపించింది. దీంతో వెంటనే చికిత్స అవసరం అని డాక్టర్లు తేల్చారు.

అయితే వైద్యులు “పార్స్ ప్లానా విట్రెక్టమీ” అనే శస్త్రచికిత్స చేసి, ఆ పురుగును జాగ్రత్తగా బయటకు తీశారు. మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించగా, అది గ్నాథోస్టోమా స్పినిగెరుమ్ అనే పరాన్న జీవి అని తేలింది. ఈ లార్వా ఎక్కువగా పూర్తిగా వండని మాంసం తినడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా కడుపులోకి చేరిన తరువాత ఇది ఇతర అవయవాల్లోకి ప్రయాణించి, చివరకు కంటికి చేరింది.

ఇలాంటి పరాన్నజీవి మెదడులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అదృష్టవశాత్తు, ఈ రోగి మెదడుకు చేరకముందే బయటకు తీసేసినట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తరువాత, రోగికి చికిత్స తర్వాత ఆంటి-పరాసిటిక్ మందులు, స్టెరాయిడ్లు అందించారు. కంటి వాపు 8 వారాల తర్వాత తగ్గిపోతుందని చెప్పారు, అయితే చూపు తిరిగి సాధారణంగా మారేందుకు ఇంకొంత సమయం పెట్టొచ్చని వైద్యులు తెలిపారు.

Also Read: ఈ 7 లక్షణాలు కనిపిస్తే మీకు మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లే.. తప్పక తెలుసుకోండి!

అయితే 2025 మేలో, ముంబైకి చెందిన కంటి వైద్యురాలు డాక్టర్ దేవాంశి షా ఓ 60 ఏళ్ల వ్యక్తి కంట్లో నుంచి 10 సెంటీమీటర్ల పొడవైన పురుగును తొలగించారు. ఆ పురుగు కాలేయం, మెదడు వరకు వెళ్లి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఆ వ్యక్తికి చూపు తిరిగి వచ్చిందని తెలిపారు.

కంటి సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా, తినే ఆహారం అపరిశుభ్రత వల్ల ఈ తరహా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

NOTE: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు