/rtv/media/media_files/2025/03/13/ye1pateuV6WHKWrjNphf.jpg)
World Kidney Day 2025
World Kidney Day 2025: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. నేటి కాలంలో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రజలను కిడ్నీ బాధితులుగా మారుస్తున్నాయి. పెరుగుతున్న మూత్రపిండాల వ్యాధుల దృష్ట్యా.. కిడ్నీ సంబంధిత సమస్యలపై అవహగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మార్చి 13న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. మొదటిసారిగా 2006 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్ కిడ్నీ దినోత్సవాన్ని ప్రారంభించాయి. మూత్రపిండాల వ్యాధులు, వాటి చికిత్స గురించి సామాన్య ప్రజలలో అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.
మూత్రపిండాలు శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. నీరు సరిగ్గా తీసుకోకపోవడం, చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఈ వ్యాధులు ఉన్నవారికి మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
అధిక రక్తపోటు
అధిక రక్తపోటు మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా మూత్రపిండంలోని రక్త నాళాలను కుచించుకుపోయి.. ఇరుకుగా అవుతాయి. ఇది రక్తప్రవాహానికి ఆటకం కలిగిస్తుంది. దీనివల్ల మూత్రపిండాలు సరిగా పనిచేయలేవు. తద్వారా కిడ్నీ సమస్యలు మొదలవుతాయి.
డయాబెటిస్
డయాబెటిస్ ఉన్నవారికి కూడా కిడ్నీ సంబంధింత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. మధుమేహం కారణంగా కిడ్నీ ఫెల్యూర్, మూత్రపిండాల సిర్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ధూమపానం, మద్యం
ధూమపానం, మద్యం సేవించడం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండా వ్యాధి (CKD) ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ధూమపానం మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అలాగే మద్యపానం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇండైరెక్ట్ గా మూత్రపిండాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఊబకాయం సమస్యతో బాధపడేవారికి కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.