/rtv/media/media_files/2025/07/17/world-emoji-day-2025-2025-07-17-09-53-25.jpg)
World Emoji Day 2025
World Emoji Day 2025: కోపానికి ఓ ఎమోజీ, బాధకు ఓ ఎమోజీ, నవ్వుకు ఓ ఎమోజీ, ఏడుపుకు ఓ ఎమోజీ ఇలా ప్రతీ భావానికి ఒక ఎమోజీ! ఇవి సంభాషణను మరింత సరదాగా, సృజనాత్మకంగా చేస్తాయి. ప్రస్తుత డిజిటల్ సంభాషణలో మాటల కంటే ఈ ఎమోజీల వాడకం బాగా పెరిగిపోయింది. చెప్పాలంటే ఇవి మన జీవితంలో ఒక బాగమైపోయాయి. ఫోన్ లో చాట్ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మనం చూడలేకపోయినా.. ఈ ఎమోజీలతో వాళ్ళ ఎక్స్ ప్రెషన్ ఏంటో తెలుసుకోవచ్చు! అందుకే ఈ ఎమోజీలకు గుర్తుగా ప్రతీ సంవత్సరం జూలై 17న మనం ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే వేలకు పైగా ఎమోజీలు ఉన్నప్పటికీ ఒక్క ఎమోజీ మాత్రం ఇంటర్నెట్ ని రూల్ చేస్తోంది. ప్రతి ఒక్కరి అదో ఫేవరేట్ ఎమోజీ అనుకోండి! అదేంటో తెలుసా?
పాపులర్ ఎమోజీ
"ఆనంద భాష్పాలతో కూడిన ఎమోజీ " (😂) ఇది డిజిటల్ సంభాషణలలో మోస్ట్ పాపులర్ ఎమోజీగా పేరు పొందింది. ఇది నవ్వు, ఆనందానికి చిహ్నంగా ఉపయోగిస్తారు.
ప్రపంచ ఎమోజి దినోత్సవం చరిత్ర
ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని 2014లో జెరెమీ బర్గ్ ప్రారంభించారు. ఆయన ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు.. ఇది ఎమోజీలకు సంబంధించిన ఒక వెబ్ సైట్ లాంటింది. మొదట్లో కేవలం 176 ఎమోజీలు మాత్రమే ఉండేవి. కానీ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత, ముఖ్యంగా 2010 నుంచి ఎమోజీలు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు వేల సంఖ్యలో ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. ఎమోజీల ప్రాముఖ్యతను గుర్తించడానికి, వాటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2014 నుంచి జూలై 17న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎమోజీపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ ఈ రోజును మొదట ప్రకటించారు.