Iron Deficiency: మహిళలకు ఐరన్ ఎందుకు అవసరం? ఐరన్ ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో ఐరన్ లోపం ఒకటి. పాలకూర, చిక్కుడు గింజలు, క్వినోవా, పప్పులు ఐరన్‌తో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Iron Deficiency షేర్ చేయండి Lron Deficiency: ఐరన్ లోపం మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య. ఎందుకంటే స్త్రీలకు ప్రతినెలా రక్తస్రావం ద్వారా రక్తం శరీరం నుండి బయటకు వస్తుంది. ఈ కారణంగా వారి శరీరానికి మళ్లీ రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. ఐరన్ శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. కాబట్టి తినే ఆహారంలో ఐరన్ లేకపోతే శరీరం రక్తహీనత సమస్యతో బాధపడుతుంది. దీని వల్ల శరీర భాగాలకు, అవయవాలకు రక్త సరఫరా సరిగా లేక, వాటి పనితీరు సమస్యగా మారుతుంది. దీనివల్ల శరీరం రోగాల బారిన పడుతుంది. ముఖ్యంగా మహిళలు ఐరన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవటంతో రక్తహీనతకు గురవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు. బీట్‌రూట్‌లో ఈ ఐరన్ పుష్కలంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ బీట్‌రూట్ కంటే ఎక్కువ ఐరన్ ఉన్న ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. శరీరానికి ఐరన్ ఎందుకు అవసరం? ఐరన్ ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. శరీరంలో తగినంత ఐరన్ ఉంటే రక్తహీనతను నివారించవచ్చు. రక్తహీనత తరచుగా అలసట, బలహీనత, తక్కువ రోగనిరోధక శక్తికి దారితీస్తుంది. ఐరన్ పిల్లలు, పెద్దలలో పెరుగుదలకు సహాయపడుతుంది. పాలకూర: ఆకుకూరల విషయానికి వస్తే కొందరు తినేందుకు ఆసక్తి చూపరు. కానీ ఆకుకూరలలో పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 100 గ్రాములలో 2.7 mg ఐరన్ ఉంటుంది. బీట్‌రూట్ కంటే పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సలాడ్లు, స్మూతీస్ లేదా వండిన వంటలలో పాలకూరను జోడించడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. చిక్కుడు గింజలు: చిక్కుడు గింజలు సలాడ్‌లు, పప్పులలో ఉపయోగిస్తారు. అవి ఐరన్, ఫైబర్, ప్రోటీన్ యొక్క మంచి మూలం 100 గ్రాముల చిక్‌పీస్‌లో 2.9 mg ఐరన్ ఉంటుంది. మీ ఆహారంలో చిక్‌పీస్‌ని చేర్చుకోవడం వల్ల ఐరన్ లెవెల్స్‌ను మెరుగుపరచడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్వినోవా: క్వినోవా ఒక తృణధాన్యం, 100 గ్రాముల క్వినోవాలో దాదాపు 2.8 mg ఐరన్ ఉంటుంది. క్వినోవాలో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ, సలాడ్‌లతో సహా వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. క్వినోవాలో మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. పప్పులు: ప్రతి ఒక్కరి ఇంట్లో పప్పులు ఉంటాయి. ఎందుకంటే సాంబారు చేయడానికి పప్పులు కావాలి. అందుకే ఎవరి ఇంటి వంట గదిలోకి వెళితే పప్పు డబ్బా కనిపిస్తుంది. చిక్కుళ్ళు మొక్కల ఆధారిత ఐరన్ అద్భుతమైన మూలం. ప్రతి 100 గ్రాముల పప్పులో దాదాపు 3.3 mg ఐరన్ ఉంటుంది. దీనిని సూప్‌లు, కూరలు, సలాడ్‌లు, సైడ్ డిష్‌లలో ఉపయోగించవచ్చు. మాంసకృత్తులు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న పప్పులు ఐరన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా, మెరుగైన జీర్ణక్రియ, బరువు నియంత్రణలో కూడా సహాయపడతాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: స్త్రీలు ఈ జననేంద్రియ లక్షణాలను అస్సలు విస్మరించవద్దు #iron-deficiency మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి