Viral Video: పక్కనే పాము.. పూజ మాత్రం ఆపేది లేదు ఛత్ పూజ సమయంలో నదిలో పూజ చేస్తున్న ఓ మహిళకు పాము కనిపించింది. కానీ ఏ మాత్రం భయపడకుండా మహిళ దాన్ని పంపించి వేయడం ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. మహిళ ధైర్య సాహసాలు చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 13 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Viral Video షేర్ చేయండి Viral Video: ఓ మహిళ పామును ధైర్యంగా తరిమికొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛత్ పూజ సమయంలో నదిలో పూజ చేస్తున్న ఓ మహిళకు పాము కనిపించింది. కానీ ఏ మాత్రం భయపడకుండా మహిళ దాన్ని పంపించి వేయడం ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఒక మహిళ ఛత్ పూజ సందర్భంగా పూజ చేసుకునేందుకు నది దగ్గరికి వెళ్లింది. నదిలో దిగి పూజ చేస్తుండగా అక్కడికి ఒక్కసారిగా ఒక విషపూరితమైన పాము వచ్చింది. దీంతో మహిళ ఏమాత్రం బెదరలేదు. నీళ్లతో పామును అక్కడి నుంచి తరిమేసింది. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రశాంతంగా పాము పక్కనే పూజా: ఇన్‌స్టాగ్రామ్‌లో 34.5 లక్షలకు పైగా లైక్‌లను, 9.6 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. మహిళ ధైర్య సాహసాలు చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. పామును చూస్తేనే ఆమడదూరం పారిపోతున్న ఈ రోజుల్లో మహిళ అయి ఉండి కూడా ప్రశాంతంగా పాము పక్కనే ఉన్నా లెక్క చేయలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియోలో దాదాపు నాలుగు అడుగుల పొడవు గల పాము ఎర్రని దుస్తులు ధరించిన మహిళ దగ్గరికి వచ్చింది. View this post on Instagram A post shared by Mady (@mein_memestar) కానీ ఆమె కూల్‌గా దాన్ని పక్కకి పంపించి పూజ కంటిన్యూ చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అది బ్యాండ్డ్ క్రైట్.. ఆంటీ అదృష్టవంతురాలంటూ ఒకరు రాసుకొచ్చారు. మరోకరు ప్రాణం కంటే ప్రతిష్ఠ ముఖ్యమని రాశారు. ఇంకో యూజర్ బ్యాండెడ్ క్రైట్ పాము కాటుకు గురైతే బతికే అవకాశాలు 10శాతమే ఉంటాయని కామెంట్ చేశాడు. ఆగ్నేయాసియాలోని బ్యాండెడ్ క్రైట్ 2 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఈ ప్రత్యేక జాతి పాము నలుపు, తెలుపు లేదా పసుపు రంగులను కలిగి ఉంటుందని, ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాములు అని అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: బీర్‌తో జుట్టును కడగడం మంచిదేనా? ఇది కూడా చదవండి: విటమిన్ డి, మెగ్నీషియం కలిపి తీసుకుంటే ఏమౌతుంది? #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి