చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. చలి ప్రభావం వల్ల చర్మం పొడిబారుతుంది, స్కిన్ మెరుపు కోల్పోతుంది. కేవలం చర్మానికే కాదు జుట్టు సమస్యలు కూడా వస్తాయి. తలలో చుండ్రు తయారై.. అధిక మొత్తంలో హెయిర్ ఫాల్ అవుతుంది.
పొడి గాలులు, చలి కారణంగా స్కిన్ తేమ తగ్గిపోతుంది. చల్లని వాతావవరణం కారణంగా వాటర్ తక్కువగా తీసుకుంటారు. దీంతో స్కిన్ డిహైడ్రేట్ అవుతుంది. వేడి వాటర్ తో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ పాడైపోతుంది. చలికాలంలో పొడి చర్మంపై కఠినమైన రసాయనాలను యూజ్ చేయడం వల్ల స్కిన్ ఎక్కువగా పాడైపోతుంది. విటమిన్, ఎ, సి, సి, డి లోపం వల్ల కూడా స్కిన్ పగులుతుంది.