ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దీని ఎత్తు నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకు అలా జరుగుతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠత ఉంటుంది.
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని చాలా మంది కలలు కంటుంటారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అంటారు. అయితే ఎవరెస్ట్ శిఖరం ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది.
ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్ల కార్యకలాపాలు. భూమి ఉపరితలం అనేక టెక్టోనిక్ ప్లేట్లతో రూపొందించబడింది. భూమి పరిభ్రమణం చెందేప్పుడు ఈ పలకలు ఒకదానికొకటి ఢీకొంటాయి. అలా పర్వతాలు ఏర్పడతాయి. అదేవిధంగా హిమాలయ పర్వతాలు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం ద్వారా ఏర్పడ్డాయి.
హిమాలయ పర్వతాలు ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ ఢీకొనడం వల్ల ఏర్పడ్డాయంటారు. ఈ రెండు ప్లేట్లు నేటికీ నెమ్మదిగా ఒకదానికొకటి కదులుతున్నాయి. దీని కారణంగా హిమాలయ పర్వతాల ఎత్తు నిరంతరం పెరుగుతోంది.
హిమాలయ ప్రాంతంలో భూకంపాలు కూడా ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగడానికి కారణమవుతాయి. భూకంపం సమయంలో పర్వతాల ఎత్తులో మార్పులకు కారణమయ్యే ప్లేట్లలో కదలిక ఉంటుంది.
ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగడానికి ఐసోస్టాటిక్ రీబౌండ్ మరొక కారణం. హిమాలయాలపై దట్టమైన మంచు పొర ఉన్నప్పుడు దాని ఒత్తిడి భూమి క్రస్ట్పై ప్రభావం చూపుతుంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల మంచు కరిగిపోతోంది.