హిందూ సంప్రదాయ పండుగల్లో నవరాత్రులకు ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా నవరాత్రుల పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రులను ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు జరుపుకుంటారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు పూజించే అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో కనిపిస్తారు.
ఇది కూడా చూడండి: ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా యాక్టివ్
అష్టైశ్వర్యాలు కలుగుతాయని..
విజయవాడ కననదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా నాలుగో రోజు అనగా ఈ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవీగా అలకరింస్తారు. చెరకుగడ, పాశం, విల్లు, అంకుశము ధరించి అమ్మవారు దర్శనమిస్తుంది. ఈరోజు లలితా త్రిపుర సుందరీ దేవీని పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఇది కూడా చూడండి: కోమాలో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తాయా? షాకింగ్ విషయాలు
ఉదయాన్నే లేచి ఇళ్లు అన్ని శుభ్రం చేసుకుని ఇంట్లో కుంకుమ పూజ చేయాలి. ఇంట్లో చేయలేని వాళ్లు కనకదుర్గమ్మ ఆలయంలో చేయవచ్చు. ఈ రోజు ఆలయంలో అమ్మవారిని కుంకుమతో పూజ చేస్తారు. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు ఈ ఆలయంలో భక్తులు అమ్మవారి సేవలో ఉంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
ఇది కూడా చూడండి: DSC: డీఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రావు