Chinese Garlic : చైనీస్ వెల్లుల్లిని గుర్తించడం ఎలా? భారత మార్కెట్లో చైనీస్ వెల్లుల్లిని 2014లో నిషేధించిన కొందరు విక్రయిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన వెల్లుల్లితో అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, కడుపు, మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమాణం, వాసన, రంగుతో చైనీస్ వెల్లుల్లిని గుర్తించవచ్చు. By Kusuma 28 Sep 2024 in లైఫ్ స్టైల్ నేషనల్ New Update షేర్ చేయండి చైనీస్ వెల్లుల్లిని 2014లో భారత మార్కెట్‌లో నిషేధించిన విక్రయిస్తున్నారు. హానికరమైన రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా తయారు చేసిన వెల్లుల్లి ఆరోగ్యం ప్రభావం చూపిస్తుందని యూపీకి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. అయితే స్థానికంగా ఉన్న వెల్లుల్లితో పోలిస్తే రసాయనాలతో ఉండే దానిని గుర్తించలేకపోవడం వల్ల ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చిట్కాలు పాటించి చైనీస్ వెల్లుల్లిని గుర్తించవచ్చు. పరిమాణం సాధారణ వెల్లుల్లి కంటే చైనీస్ వెల్లుల్లి పెద్దగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు మందంగా ఉంటాయి. కానీ స్థానిక వెల్లుల్లి మాత్రం సాధారణ పరిమాణంలో ఉంటూ వెల్లుల్లి రెబ్బలు సన్నగా ఉంటాయి. వాసనసహజంగా పండించిన స్థానిక వెల్లుల్లి వాసనను చూసినప్పుడు ఘాటుగా వస్తుంది. అదే చైనీస్ వెల్లుల్లి అయితే అసలు వాసన ఉండదు. రంగురసాయనాలతో తయారు చేసే వెల్లుల్లి తెల్లగా మెరిసిపోతుంది. అదే సహజ వెల్లుల్లి అయితే కాస్త పసుపు రంగు తెలుపులో ఉంటుంది. తొక్క తీయడంవెల్లుల్లి తొక్క తీస్తే చేతులు నొప్పి వస్తుంది. ఇలా నొప్పి రాకుండా తొక్క ఈజీగా వచ్చేస్తే అది చైనీస్ వెల్లుల్లి అని గుర్తించాలి. అనారోగ్య సమస్యలుచైనా వెల్లుల్లిని తయారు చేయడానికి సింథటిక్ పదార్థాలు, రసాయనాలు వంటివి వాడుతారు. వీటివల్ల అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, కడుపు సంబంధిత సమస్యలు, మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటం కారణంగా ఈ వెల్లుల్లిని ఇండియాలో నిషేధించారు. Also Read : ''మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా''.. ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ట్వీట్ #garlic #chinese మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి