Bath: స్నానం చేసేప్పుడు మూత్రం వస్తే ఇలా మాత్రం చేయొద్దు

స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందట. మూత్రం విసర్జించినప్పుడు.. కాళ్లకు పుండ్లు, గాయాలు ఉంటే వాటికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. బాత్ టబ్​లో మూత్రం విసర్జిస్తే ఒళ్లు మొత్తానికి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాన్స్‌ ఉంది.

New Update

Bath: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఆహారం తీసుకోవాలి. ఒక వ్యక్తికి ఆహారం ఎంత ముఖ్యమో.. పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. పరిశుభ్రత కోసం రోజూ స్నానం చేయడం అంతే అవసరం. స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇన్ఫెక్షన్స్ రావడానికి చాన్స్‌

మూత్రంలో పలురకాల మలినాలు ఉంటాయి. మరికొందరిలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి వారు స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే.. అనర్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మూత్రం విసర్జించినప్పుడు.. కాళ్లకు పుండ్లు, గాయాలు ఉంటే వాటికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరు బాత్ టబ్​లో స్నానం చేస్తారు. నిండుగా ఉన్న సబ్బు నీటిలోకి దిగి వీరు స్నానం చేస్తారు. ఇలాంటి వారు అందులో మూత్రం విసర్జిస్తే అది ఆ నీటిలోనే కలిసిపోతుంది. తద్వారా నీరు కలుషితమవుతుంది. అది ఒళ్లు మొత్తానికి అంటుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి చాన్స్‌ ఉంది. మగవారిని పక్కనపెడితే.. స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం.. మహిళలకు మరింత హాని కలిగిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఎవరికీ అంతుచిక్కని అరుదైన పాము గుర్తింపు

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe