Ugadi 2025: ఉగాది నుంచి ఈ రాశుల వారికి అలెర్ట్..! లేదంటే ఇబ్బందులే

పంచాంగం ప్రకారం.. గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయి. మకర, మేష, కుంభ, వృషభ, వృశ్చిక, సింహా రాశుల వారికి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి.

author-image
By Archana
New Update
ugadi 2025 - zodiac sign

ugadi 2025_ zodiac sign

Ugadi 2025 Zodiac Signs: హిందూ క్యాలెండర్ ప్రకారం.. తెలుగు వారికి ఉగాది పండగతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.  తెలుగు పంచాంగంలో ఒక్కో తెలుగు సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది.  ఈ ఏడాది ఉగాదిని శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం'గా పిలవబడుతుంది.  అయితే ఉగాది పండగ తర్వాత వచ్చే కొత్త తెలుగు సంవత్సరంలో  కొన్ని గ్రహాలు స్థానాలు మార్చుకోవడం  కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది. 

ముఖ్యంగా జన్మ రాశి ప్రకారం..  ఏలినాటి శని ప్రభావం  (శని 12వ స్థానంలో) , అర్దాష్టమ ప్రభావం (శని దేవుడు 6వ స్థానంలో)  ఉన్న రాశుల వారు ఉగాది నుంచి ఆర్ధిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఉగాది తర్వాత ఏ రాశుల వారు ఏలినాటి శని,  అర్దాష్టమ శని ప్రభావం బారిన పడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మేషరాశి

మేష రాశి వారు ఉగాది నుంచి ఆర్థికంగా  ఇబ్బందులను ఎదుర్కోనున్నారు.  ఆదాయానికి మించి ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్ధిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ.. డబ్బును పొదుపు చేస్తే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. 

సింహరాశి

ఈ సంవత్సరం సింహ రాశి వారికి   వ్యయం 11, ఆదాయం 11 గా ఉంటుంది. రెండు సమానంగా ఉండడం వల్ల చేతుల్లో డబ్బులు ఉండవు. ఫలితంగా ఆర్ధిక సమస్యలు వస్తాయి. ఈ రాశివారు ఆర్ధిక వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. 

కుంభరాశి

తెలుగు నూతన సంవత్సర పంచాంగం ప్రకారం.. కుంభ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14.  ఉగాది తర్వాత వీరికి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ధనస్థానంలోకి శని ప్రవేశించడం ద్వారా ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఆర్ధిక బాధ్యతలను జీవిత భాగస్వామికి అప్పగించడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 వ్యయం 14. సంపాదన కంటే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. కావున కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశివారు డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. 

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి 5 ఆదాయం, 5 వ్యయం. ఈ రాశివారికి అర్ధాష్టమ శని కారణంగా ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. ఆర్ధిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మకర రాశి

విశ్వసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14.  ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చులు తగ్గించి.. డబ్బును పొదుపుగా వాడడం అలవాటు చేసుకోండి. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

 telugu-news | latest-news

Advertisment
తాజా కథనాలు