Teeth: పైసా ఖర్చు లేకుండా దంతాలను మెరిపించుకోండి

రోజూ బ్రష్ చేసినప్పటికీ దంతాలు పసుపు రంగులోకి మారాయి. ఇది ధూమపాన అలవాటు ,టీ, కాఫీ, సోడా డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు. దంతాల పసుపును తొలగించడానికి ఉప్పు, కొన్ని చుక్కల ఆవనూనె మిక్స్ చేసి దంతాల మీద మసాజ్ చేస్తే సమస్య తగ్గుతుంది.

New Update
teeth7

Teeth

Teeth Tips: చిరునవ్వు వ్యక్తిత్వానికి చిహ్నం కాబట్టి దంతాలను శుభ్రంగా, బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ దంతాలు పసుపు రంగులోకి మారడం సాధారణ సమస్యగా మారింది. ఇది తరచుగా ప్రజలకు చాలా ఇబ్బంది మారుతోంది. సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయని అనే భావన మనలో ప్రతి ఒక్కరి లో ఉంటుంది. కానీ దంతాలు పసుపు రంగులోకి మారడానికి అనేక కారణాలు ఉండవచ్చని  నిపుణులు అంటున్నారు. రోజూ బ్రష్ చేసినప్పటికీ  దంతాలు పసుపు రంగులోకి మారితే అది ధూమపాన అలవాటు లేదా టీ, కాఫీ, సోడా డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు. ఇంట్లోనే సులభంగా దంతాల పసుపు రంగును వదిలించుకోవచ్చు.

అరటి తొక్క:

  • అరటి తొక్క దంతాలకు చాలా ప్రయోజనకరం. దంతాల మెరుపు కోసం దీనిని  వినియోగించవచ్చు.  ఇందుకోసం అరటిపండు తొక్కను తీసుకుని దంతాల మీద రుద్దండి. ఇలా చేయడం వల్ల డెంటల్ క్యావిటీస్ సమస్య కూడా తొలగిపోతుంది.

వేప:

  • దంత సమస్యలకు వేప చాలా మంచిది. దంతాలు పసుపు రంగులోకి మారడం, ఇతర దంత సమస్యలకు వేప ఒక గొప్ప ఔషధం. ఇది దంతాల నుండి పసుపును తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. వేప టూత్‌ పేస్ట్‌ కూడా మార్కెట్‌లో దొరుకుతోంది. ఇది దంతాల సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. వేపలో దంతాలను తెల్లగా చేయడం, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

ఆవాల నూనె-ఉప్పు:

  • దంతాల పసుపును తొలగించడానికి ఉప్పు, ఆవాల నూనెను ఉపయోగించండి. దీని కోసం అర టీస్పూన్ ఉప్పు తీసుకోండి. అందులో కొన్ని చుక్కల ఆవనూనె మిక్స్ చేసి దంతాల మీద మసాజ్ చేయాలి. ఇది దంతాల పసుపును తొలగిస్తుంది. ఈ రెమెడీని ఒక వారం పాటు చేయవచ్చు.

ఈ విషయాలు గుర్తుంచుకోండి:

  • దంతాలు పసుపు రంగులోకి మారకుండా ఉండటానికి క్రమం తప్పకుండా బ్రష్ చేయండి. భోజనం తర్వాత ఎప్పుడూ పుక్కిలించి ఊయాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు బ్రష్ చేయడం మరచిపోవద్దు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read: 40 ఏళ్ల తర్వాత ఎముకలు బలహీనపడటానికి కారణం?

Advertisment
తాజా కథనాలు