Today Horoscope: గడ్డు కాలమంటే ఈ రాశులదే.. నేడు ఏ పని తలపెట్టినా ఆటంకమే!

నేడు కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవని పండితులు అంటున్నారు. ఎంత మంచిగా ఇతరులతో ఉన్నా కూడా ఏదో ఒక సమస్య వస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే నేడు ఏయే రాశుల వారికి చెడు జరగనుందో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
Today Horoscope

Today Horoscope

మేషం

వ్యాపారులకు నేడు చాలా బాగుంటుంది. వీరికి సమాజంలో మంచి పేరు వస్తుందని, అన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీటివల్ల అన్ని విధాలుగా మంచి జరగుతుందని పండితులు అంటున్నారు. అలాగే కుటుంబం, స్నేహితులతో  కలిసి హ్యాపీగా ఉంటారు. ఉద్యోగం విషయంలో ఇంకా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

వృషభం
నేడు మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పండితులు అంటున్నారు. అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

మిథునం
ఈ వారం ఈ రాశి వారికి బాగుంటుంది. చేసే పనుల్లో విజయం లభిస్తుంది. అందరూ కూడా మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఇంకా మంచి ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది.

కర్కాటకం 
ఈ వారం కలిసొచ్చే ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ఆటంకమే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం ముఖ్యమని పండితులు అంటున్నారను. అయితే ఇతరుల మాటల కంటే కుటుంబ సభ్యుల మాటలను వినడం మంచిదని పండితులు అంటున్నారు. నేడు కొన్ని అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం బెటర్ అని పండితులు చెబుతున్నారు. 

సింహం 
వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది, అలాంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో మీ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను వేసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి, శని శ్లోకాలను చదవడం మంచిది.

కన్య 
మీ ధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు, కానీ ఎవరి మాటలను పట్టించుకోవద్దు. స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. శివుడి పేరును జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

తుల 
ఉద్యోగం, వృత్తిలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయంతో మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవి నామాన్ని జపించడం మంచిది.

వృశ్చికం 
ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. పెద్దల సలహాలను తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. సరైన సమయానికి తినడం, పడుకోవడం చాలా అవసరం. దుర్గాదేవిని దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు
దైవబలం వల్ల మీరు అనుకున్న పనులు పూర్తి అవుతాయి. ముఖ్యమైన పనుల విషయంలో పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. కుటుంబం, స్నేహితుల వల్ల మీకు మేలు జరుగుతుంది. డబ్బు విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిని చదవడం మంచిది.

మకరం 
ఉద్యోగంలో మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య వల్ల మీ మనసు కొంచెం కంగారుగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. డబ్బు బాగా ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీ లక్ష్మీ స్తోత్రం చదవడం చాలా మంచిది.

కుంభం
మొదలుపెట్టిన పనుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల సహాయం మీకు అవసరం. కొన్ని సంఘటనలు మీకు బాధ కలిగించవచ్చు. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నవగ్రహాల స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

మీనం
మీరు చేసే పనుల్లో మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహాయం మీకు చాలా అవసరం. కొన్ని విషయాలు మీకు బాధ కలిగించవచ్చు. అన్ని విధాలా మంచి జరగడానికి నవగ్రహాల శ్లోకాలను చదువుకోవడం చాలా మంచిది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు