Today Horoscope: అదృష్టమంటే ఈ రాశులదే భయ్యా.. ఏ పని తలపెట్టినా డబ్బే డబ్బు!

నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా విజయం పొంది డబ్బు సంపాదిస్తారని పండితులు అంటున్నారు. అయితే నేడు విజయం పొందే రాశులేవో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

New Update
Horoscope Today

Horoscope Today

నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా విజయం పొంది డబ్బు సంపాదిస్తారని పండితులు అంటున్నారు. అయితే నేడు విజయం పొందే రాశులేవో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

మేషం

మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో కాస్త  జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శివుడిని పూజించడం మంచిదని పండితులు అంటున్నారు. 

వృషభం
వృత్తి, ఉద్యోగాలలో మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. పెద్దల సహాయం లభిస్తుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. సూర్య స్తోత్రం చదవడం చాలా మంచిది.

మిథునం
ఏదైనా పని మొదలుపెడితే, ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి. 

కర్కాటకం
కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ ఉంటుంది. అందరి ప్రశంసలు దక్కుతాయి. అలాగే మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని పండితులు అంటున్నారు. 

సింహం
ఈ రోజు ఒక శుభవార్త వింటారు. ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అన్నింట్లో విజయం పొందుతారని పండితులు అంటున్నానరు. నేడు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. 

కన్య
కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మీ మీద పడతాయి. వాటిని మీరు సమర్థంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతారు. మీరు విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏ పరిస్థితిలోనూ దేవుడిని పూజించడం మానవద్దు. 

తుల
మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు తీసుకున్న కీలక నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. శివ స్తోత్రం చదవడం చాలా మంచిది.

వృశ్చికం
మీరు మంచి కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు, స్నేహితుల వల్ల మీకు మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ధనుస్సు
మీకు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. మీ తెలివితేటలు బాగుంటాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీకు ఇష్టమైన దేవుడిని దర్శించుకోవడం మంచిది.

మకరం
మీ మంచి మనసు మీకు ఎదుగుదలకు కారణం అవుతుంది. మంచి మనసుతో ముందుకు వెళ్లి అనుకున్నది సాధిస్తారు. డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోవడం మంచిది.

కుంభం
మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మీరు అనుకున్నది సాధిస్తారు. మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక మంచి వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. 

మీనం
మీ ఉత్సాహాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. మీ పేరు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మీ మనసుకు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిదని పండితులు అంటున్నారు. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు