/rtv/media/media_files/2025/01/25/1OMq4QlbeytD7eXzGRTr.jpg)
Horoscope Today
నేటి రాశి ఫలాలు
చాలా మంది రాశి ఫలాలను నమ్ముతారు. అందువల్ల ప్రతి రోజు ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది. మరి ఇవాళ్టి రాశి ఫలాల విషయానికొస్తే.. కొన్ని రాశుల వారికి తిప్పలు తప్పవని తెలుస్తోంది. మరికొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారంలాగే కనిపిస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అంటే గుడి దర్శనాల్లో మునిగితేలుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనోబలం ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి.
Also Read: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్
వృషభం: మీ తోటివారితో ఆనందంగా ఉంటారు. వారితో సంతోషాన్ని షేర్ చేసుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు, చేసే పనులు సకాలంలో నెరవేరుతాయి. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. అలాగే వస్త్ర, ధన లాభం కూడా నిండుగా ఉంటుంది.
మిథునం: మిథున రాశి వారికి అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ప్రోత్సాహకాలు ఉంటాయి. పట్టుదలతో ముందుకు సాగాలి. అంతేకాకుండా మానసికంగానూ దృఢంగా ఉంటారు.
కర్కాటకం: మీమీ రంగాల్లో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి. అలాగే విశేషమైన ఫలితాలను కూడా సాధిస్తారు. వీటన్నింటితో పాటు ఒక శుభవార్త మీలో మరింత మనోధైర్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి.
సింహం: విందు, వినోదాలు కలుగుతాయి. ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో కాస్త ఆచితూచి అడుగులు వేయాలి.
కన్య: మీ మీ పనుల్లో ఘనంగా విజయం సాధిస్తారు. సంపూర్ణ మనోబలంతో ఉంటారు.
Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
తుల: నేడు తుల రాశి వారికి కాస్త తిప్పలు తప్పనట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. అలాగే కొన్ని కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు సైతం బెడిసికొడతాయి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల కీలక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవాలి.
వృశ్చికం: మీ మీ పనుల్లో లాభదాయక ఫలితాలు అందుతాయి. దైవశక్తి అనుకూలిస్తోంది. మీరు కన్న ఆశయాలు నెరవేరుతాయి.
ధనుస్సు: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. కొన్ని కీలక విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు.
మకరం: నేడు మకరం రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీమీ పనుల్లో ప్రణాళికతో ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి కొందరు సహాయం చేస్తారు.
కుంభం: కుంభ రాశివారు ఆచితూచి అడుగువేయాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ మీ పనుల్లో ఒత్తిడిని దగ్గరకి రానీయకండి. ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
మీనం: మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల వల్ల ఆనందాన్ని పొందుతారు. ఆత్మీయుల సహకారం ఉంటుంది.