మంగళవారం చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ధ్రువ యోగం, త్రిపుష్కర యోగం ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో కర్కాటకం, కన్య రాశులతో పాటు ఈ రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే సూచనలు కనపడుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని రాశుల వారికి హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉండనుంది.మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మేష రాశి వారు ఈరోజు తెలివితో తీసుకున్న నిర్ణయాల ద్వారా మంచి విజయం అందుకుంటారు. ఈరోజు మీ వ్యాపారానికి సంబంధించి సుదూర ప్రయాణం చేయొచ్చు. దీని నుండి మీరు చాలా ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన పడే అవకాశాలున్నాయి. మార్కెటింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాన్ని పొందొచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు బద్ధకాన్ని తరిమికొట్టి ముందుకు సాగితేనే ఏదైనా పనిలో విజయం అందుకుంటారు. మరోవైపు ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈరోజు పని చేసే వ్యక్తులు కొంత ఓపిక పట్టాలి. తొందరపడి ఏ పనీ చేయకండి. మిధున రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. పిల్లల విషయంలో మీకు విభేదాలు ఉండొచ్చు. అది మిమ్మల్ని కలవరపెడుతుంది. సాయంత్రం, అతిథి మీకు కొన్ని శుభవార్తలను అందించొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. సాయంత్రం, మీరు కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొనొచ్చు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి వారు ఈరోజు ఏదైనా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే, దాన్నుంచి మీకు ఆశించిన మేర లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇది మీ మనసుకు సంతోషాన్నిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది. సింహ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీంతో మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు గందరగోళానికి గురై మీ పనులను పూర్తి చేయలేరు. కాబట్టి ముందుగా అడ్డంకులను అధిగమించాలి. కన్య రాశి వారు ఈరోజు పిల్లల పెళ్లికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఇందులో మీ కుటుంబంలోని పెద్దవారి సహాయం అవసరం. ఈరోజు సాయంత్రం నుండి రాత్రి వరకు కుటుంబంతో గడుపుతారు. తులా రాశి వారు ఈరోజు ఊహించని విధంగా వ్యాపారంలో కొన్ని లాభదాయకమైన ఒప్పందాలను తీసుకుంటారు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీరు ఒక సీనియర్ వ్యక్తి మాట వినాలి. అప్పుడే మీ ముఖ్యమైన పని పూర్తవుతుంది. మీరు దీన్ని చేయకపోతే సమస్యలు తలెత్తొచ్చు. మీ పని ఏదైనా కొంతకాలం పెండింగ్‌లో ఉంటే, అది కూడా ఈరోజే పూర్తి అయిపోతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. దీని కోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది మీ కీర్తిని పెంచుతుంది. ధనస్సు రాశి వారికి ఈరోజు కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే అది ఈరోజుతో పరిష్కారం అవుతుంది. దీని కోసం మీకు సీనియర్ కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మంచిది. మరోవైపు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. ఈ కారణంగా మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. మకర రాశి వారిలో విద్యార్థులు పోటీ రంగాల్లో ప్రత్యేక విజయాలు అందుకుంటారు వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. దీని కోసం మీరు సోమరితనాన్ని వదులుకోవాలి. లేదంటే పెద్ద చిక్కుల్లో పడొచ్చు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా, ఈరోజు మీ కోసం సమయాన్ని ఇవ్వలేరు. ఈ కారణంగా మీ పిల్లలు మీపై కోపంగా ఉండొచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభ రాశి వారు ఈరోజు ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీ భాగస్వామి నుండి సలహా తీసుకోవచ్చు. మీ వ్యాపారానికి వారి సలహా ప్రభావవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉండొచ్చు. దీంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీన రాశి వారిలో వ్యాపారులు కొందరు వ్యక్తుల నుంచి మంచి సలహాలు అందుకుంటారు. ఈరోజు వ్యాపార రంగంలో మీకు అనుకూలమైన లాభాలు వస్తాయి. కాబట్టి మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఎవరైనా విదేశాల నుండి వ్యాపారం చేస్తున్నట్లయితే వారు చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈరోజు మీ పిల్లల కోసం కొంత డబ్బును పెట్టుబడి పెడతారు. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్య, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.