ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు పెడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే! ఫ్రిడ్జ్‌లో కొన్ని రకాల ఆహార పదార్ధాలను నిల్వ ఉంచకూడదు. ముఖ్యంగా టమాటో, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, అరటి పండ్లు, వెల్లుల్లిని నిల్వ ఉంచకూడదు. ఉష్ణోగ్రత వల్ల ఈ పదార్థాలు హానికరంగా మారుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 23 Sep 2024 in లైఫ్ స్టైల్ other New Update షేర్ చేయండి ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండాలని ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే కొన్ని పదార్థాలను పెట్టకూడదు. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టిన కొన్ని పదార్థాలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని ఆ పదార్థాలేంటో మరి చూద్దాం. బంగాళదుంపలు సగం కట్ చేసిన బంగాళదుంపలు లేదా తాజాగా ఉన్నవాటిని అయిన ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల దుంపల్లోని పిండి చక్కెరగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. టమాటో టమాటోలో కెరోటినాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీనివల్ల ఫ్రిడ్జ్‌లో పెట్టిన టమాటోల రంగు మారుతుంది. ఇలా మారిన టమాటోలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉల్లిపాయ ఫ్రిడ్జ్‌లో ఉల్లిపాయలు పెడితే తేమకి తడిగా మారుతాయి. దీంతో వండిన కూరలు రుచి తగ్గడంతో పాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి వెల్లుల్లిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. చల్లని ఉష్ణోగ్రత వల్ల తొందరగా చెడిపోతాయి. ఇలా పాడైన వెల్లుల్లిని తింటే ఆరోగ్యం క్షీణిస్తుంది. అరటిపండ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టిన అరటి పండ్లను తినడం వల్ల అనారోగ్య బారిన పడతారు. ఉష్ణోగ్రత వల్ల తొందరగా అరటిపండ్లు నల్లగా అయిపోతాయి. అరటిపండ్లు బయట ఉంచిన రెండు నుంచి మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-news-in-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి