Fat: ఫ్యాట్‌ మొత్తం కరిగించే అద్భుతమైన పండ్లు ఇవే

బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. ఆపిల్, కివీ, బెర్రీలు, ద్రాక్షపండు, పుచ్చకాయ, సీతాఫలం, నారింజ, అరటిపండు, అవకాడో, రేగు, చెర్రీ, నేరేడు పండ్లు తింటే కూడా కొవ్వు కరిగిపోతుందని వైద్యులు అంటున్నారు.

Berries and fat

Berries and Fat

New Update

Fat: బరువు పెరగడం వల్ల మన శరీరం అందవిహీనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అనేక వ్యాధులకు కూడా కారణం కావచ్చు. బరువు పెరగడం స్థూలకాయానికి దారితీస్తుంది. మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. వర్కౌట్స్‌ చేస్తూ కొవ్వును కరిగించుకోవాలని చూస్తుంటారు. అయినా చాలా మందికి ప్రయోజనం ఉండటం లేదుద. కొన్ని పండ్లు తీసుకోవడం ద్వారా ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.

ఆపిల్:

  • ఆపిల్‌లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పెద్ద సైజు యాపిల్‌లో 5.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి ఎన్నో పోషకాలు ఈ పండులో ఉన్నాయి. అనేక వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడుతుంది.

 కివీ:

  • కివీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం కివీ తినడం వల్ల బీపీ తగ్గుతుందని తేలింది. నడుము పరిమాణం కూడా తగ్గుతుంది. ఈ పండును ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చు.

బెర్రీలు:

  • బెర్రీలలో చాలా తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ, వాపు తగ్గుతాయి. ఎవరైనా అధిక బరువుతో ఉంటే దానిని నియంత్రించడానికి బెర్రీలు తినవచ్చు.

ద్రాక్షపండు:

  • వేగవంతమైన బరువు తగ్గించే గుణాలు ద్రాక్షపండులో ఉన్నాయి. దీన్ని తినడం ద్వారా మనకు రోజువారీ అవసరాలలో సగానికి పైగా విటమిన్ సి లభిస్తుంది. ఈ పండులోని GI కారణంగా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కొవ్వును సులభంగా కరిగిస్తుంది.

పుచ్చకాయ:

  • తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు ఇందులో ఉంటాయి. అంతే కాకుండా పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇది కొవ్వును కరిగిస్తుంది.
  • అలాగే సీతాఫలం, నారింజ, అరటిపండు, అవకాడో, రేగు, చెర్రీ, నేరేడు పండ్లు తింటే కూడా కొవ్వు కరిగిపోతుందని వైద్యులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయా..?

#fat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe