Heart Healthy: చలికాలం మొదలైంది. ఉష్ణోగ్రత పడిపోవడం, చల్లగా ఉండటంతో తెల్లవారుజామున దుప్పట్లతో ఇంటి లోపల నిద్రించడానికి ఇష్టపడతారు. అయితే ఉదయాన్నే నడక శరీరానికి, మనస్సుకు ఎంత మేలు చేస్తుంది. చల్లని గాలిలో నడవడం వల్ల ఫిట్‌గా ఉండటమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చలికాలంలో మార్నింగ్ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఎక్కువ కేలరీలను బర్న్:
- చల్లటి వాతావరణం శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి కష్టపడి పని చేస్తుంది. ఈ ప్రక్రియను థర్మోజెనిసిస్ అంటారు. ఇది జీవక్రియను వేగవంతం చేసి కేలరీలను బర్న్ చేస్తుంది. తాజా అధ్యయనం ప్రకారం.. చల్లని వాతావరణంలో నడిచే వ్యక్తులు సాధారణ ఉష్ణోగ్రతలలో నడిచే వ్యక్తుల కంటే 30% ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి చల్లని వాతావరణంలో మార్నింగ్ వాకింగ్ ఒక అద్భుతమైన ఎంపికని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి అధికం:
- చల్లని వాతావరణంలో నడవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. తాజా, చల్లని గాలి శరీరం ఫ్లూ, జలుబు వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆరుబయట సమయం గడపడం వల్ల అలెర్జీలు, ఇన్ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధకశక్తి పెరుగుతుందని పరిశోధనలో తెలింది. నడక సమయంలో రక్తప్రసరణ పెంచి శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది.
మానసిక ఆరోగ్యం:
- చలికాలంలో మార్నింగ్ వాకింగ్ మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్వచ్ఛమైన గాలి, తేలికపాటి సూర్యకాంతి శరీరం సెరోటోనిన్, ఎండార్ఫిన్‌ల వంటి 'ఫీల్-గుడ్' హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌ని నయం చేస్తుంది. రోజంతా శక్తివంతంగా, సంతోషంగా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యం:
- చలికాలంలో నడవడం వల్ల గుండెకు తేలికపాటి వ్యాయామం లభిస్తుంది. చల్లని గాలిలో, రక్త ప్రసరణను పెంచడానికి గుండె చాలా కష్టపడాలి. తద్వారా గుండెను బలోపేతం చేస్తుంది. చల్లని వాతావరణంలో రోజూ నడవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, రక్తపోటు అదుపులో ఉంటుంది. చలికాలంలో వాకింగ్ షూలను ధరించి నడవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మార్కెట్లోకి కొత్తరకం చక్కెర.. ఎంత తిన్నా షుగర్ రాదు