Land: భూమిపై అంతరిక్షానికి దగ్గరగా ఉండే వింత ప్రదేశం

భూమి, అంతరిక్షం మధ్య దూరం గణనీయంగా తగ్గే ప్రదేశం ఒకటి ఉంది. అదే పాయింట్ నెమో. ఇక్కడ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దానిపై నివసించే వ్యోమగాములు కేవలం 250 మైళ్ల దూరంలోనే ఉంటారు. భూమికి అతి సమీపంలోని పొడి ప్రదేశం డ్యూసీ అనే చిన్న ద్వీపం. 

land

land

New Update

Land: భూమి, అంతరిక్షం మధ్య దూరం చాలా తక్కువ ఉండే ఒక ప్రదేశం ఉంది. ఇక్కడి నుంచి అంతరిక్షం కేవలం 250 మైళ్ల దూరంలో ఉంటుందని చెబుతారు. గజిబిజి, ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రశాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్లాలని అందరూ కోరుకుంటారు. ఓ ప్రదేశంలో కేవలం ప్రశాంతత మాత్రమే ఉంటుంది. మనందరికీ భూమి నుంచి అంతరిక్షానికి దూరం, అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది తెలిసే ఉంటుంది. అయితే భూమి, అంతరిక్షం మధ్య దూరం గణనీయంగా తగ్గే ప్రదేశం ఒకటి ఉంది. ఆ ప్రదేశం ఎంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

అంతరిక్షాన్ని చేరుకోవచ్చు:

అదే పాయింట్ నెమో. ఇక్కడ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దానిపై నివసించే వ్యోమగాములు కేవలం 250 మైళ్ల దూరంలోనే ఉంటారు. భూమికి అతి సమీపంలోని పొడి ప్రదేశం డ్యూసీ అనే చిన్న ద్వీపం. డ్యూసీ ద్వీపం నుంచి పాయింట్‌ నెమో 1600 మైళ్ల దూరం ఉంటుంది. పాయింట్ నెమో నుంచి భూమికి సమీప భాగానికి చేరుకునే దానికంటే వేగంగా పైకి వెళ్తే అంతరిక్షాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. చిన్న శబ్ధం వచ్చినా మనకు వణుకు పుట్టడం ఖాయం. లాడ్‌బైబుల్ నివేదిక ప్రకారం 1971-2016 మధ్య 260కి పైగా అంతరిక్ష నౌకలు ఇక్కడ ఖననం చేయబడ్డాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం!

 

భూమిపై అత్యంత మారుమూల ప్రాంతం:

దీనిని అంతరిక్ష నౌక స్మశానవాటిక అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశానికి కెప్టెన్ నెమో పేరు పెట్టారు. ఈ స్థలాన్ని సర్వే ఇంజనీర్ హ్ర్వోజే లుకటేలా కనుగొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ ప్రదేశం భూమిపై అత్యంత మారుమూల ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఏదైనా వ్యోమనౌక లేదా స్టేషన్‌లో ఏదైనా లోపం ఏర్పడినప్పుడు, దానిని ఇక్కడకు తీసుకువచ్చి డంప్ చేస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

#land
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe