Blood Sugar: 14 రోజుల పాటు చక్కెరకు గుడ్‌బై చెబితే షాకింగ్‌ మార్పులు

14 రోజుల పాటు ఆహారంలో చక్కెరను తొలగిస్తే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అధికంగా షుగర్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమవుతాయి, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. ఇది డయాబెటిస్‌, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.

New Update
Blood Sugar

Blood Sugar Photograph

Blood Sugar: మన రోజువారీ అలవాట్లలో చక్కెర తీసుకోవడం చాలా సాధారణ విషయంగా మారింది. టీ, కాఫీ, స్వీట్లు, జంక్ ఫుడ్‌లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల మనకు తెలియకుండానే వాటిని ఎక్కువగా తీసుకుంటాం. అయితే 14 రోజుల పాటు ఆహారంలో చక్కెరను తొలగిస్తే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. షుగర్ మానేసిన తర్వాత గమనించే మొదటి మార్పులలో ఒకటి బరువు తగ్గడం. చక్కెరలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. చక్కెరను వదులుకున్నప్పుడు కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. 

వ్యాధుల నుంచి ఉపశమనం:

14 రోజుల్లో తేలికగా అనుభూతి చెందుతారు. బరువు 1-2 కిలోలు తగ్గవచ్చు. అధికంగా షుగర్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమవుతాయి. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. 14 రోజుల పాటు చక్కెరను వదులుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. శరీరం చక్కెరను మరింత సమర్థవంతంగా శక్తిగా మారుస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం శరీరాన్ని చికాకుపెడుతుంది. ఇది మొటిమలు, ముడతలు, ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. చక్కెరను వదులుకుంటే చర్మం అదనపు మంట,  వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతుంది. 14 రోజుల తర్వాత చర్మం కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. 

ఇది కూడా చదవండి: అమృతాన్ని మించిన తమలపాకు..లాభాలు అన్నీఇన్నీ కాదు

చక్కెర తక్షణ శక్తిని అందిస్తుంది. కానీ ఈ శక్తి ఎక్కువ కాలం ఉండదు. చక్కెర తిన్న తర్వాత శరీరంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. తరువాత వేగంగా పడిపోతుంది. దీని వలన ఒక వ్యక్తి అలసిపోతాడు. 14 రోజులు చక్కెరను వదులుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు,  ప్రోటీన్ వంటి స్థిరమైన శక్తి లభిస్తుంది. ఇది శక్తి స్థాయిని మెరుగుపరుస్తుంది. రోజంతా రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. చక్కెరను వదులుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. శరీరం సహజ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ 5 వస్తువులను నెయ్యిలో కలిపి తినకూడదు.. విషంతో సమానం

Advertisment
తాజా కథనాలు