Body Odor: చిన్న చిట్కాతో శరీర దుర్వాసన మాయం పటిక శరీర దుర్వాసనను పోగొట్టడంలో రెండు విధాలుగా పనిచేస్తుంది. రక్త నాళాలను ఉత్తేజపరుస్తుంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీంతో శరీరం చెడు వాసన రాదు. By Vijaya Nimma 11 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Body Odor షేర్ చేయండి Body Odor: శరీర దుర్వాసన చాలా మంది తట్టుకోలేరు. ఎన్నో డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లు వాడినా ఈ దుర్వాసన పోదు. పటికతో దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. పటిక అనేది ఖనిజ లవణం. ఇది ఎక్కువగా వంటగది, నీటి శుద్దీకరణతో పాటు పురాతన ఔషధాలలో ఉపయోగిస్తారు. ఇది శరీర దుర్వాసనను పోగొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తస్రావ నివారిణిగా చెబుతారు. ఇది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఒకసారి అప్లై చేస్తే ఇది చెమట రూపంలో శరీరం నుంచి ఆవిరైపోతుంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. చర్మపు బ్యాక్టీరియా కుళ్లిపోతే శరీరం దుర్వాసన వస్తుంది. చెమట అనేది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సహజ ప్రక్రియ. కానీ బ్యాక్టీరియాతో చెమట కలయిక దుర్వాసనకు కారణమవుతుంది. ఈ సమయంలో పటిక రెండు విధాలుగా పనిచేస్తుంది. రక్త నాళాలను ఉత్తేజపరుస్తుంది. రంధ్రాలను మూసివేస్తుంది. శరీరం ఎక్కువ చెమటను ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ కంటెంట్ ఈ దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది దీంతో శరీరం చెడు వాసన రాదు. ఎలా ఉపయోగించాలి..? పొడి, రాయి, ద్రవ రూపంలో పటిక లభిస్తుంది. రాతి రూపంలో ఉండే పటికను నేరుగా అప్లై చేసుకోవచ్చు. నీటిలో వేసి కరిగిన తర్వాత దుర్వాసన ఉన్న చోట అప్లై చేయాలి. చంకలు, దుర్వాసన ఎక్కువగా ఉండే ప్రాంతాలపై రాసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత కడిగేసుకోవచ్చు. ఒక టేబుల్ పొడికి కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. స్ప్రే బాటిల్‌లో వేసుకుని దుర్వాసన వచ్చిన చోట కొట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: మూడు సార్లు బొప్పాయి ఆకుల రసం తాగితే మూడు వ్యాధులు పరార్! #body మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి