చాలా మందికి రాత్రిపూట లోదుస్తులతో నిద్రపోవడం అనేది సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా లోదుస్తులు పాలిస్టర్ లేదా నైలాన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్లతో తయారు చేస్తారు. దీని వల్ల చర్మం, శ్వాస సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. తేమతో కూడిన వాతావరణం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.
మహిళలు బిగుతుగా ఉండే లోదుస్తులు వేసుకుంటే తేమ పెరగడం వల్ల యోని ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. పురుషులకు గజ్జ ప్రాంతం చుట్టూ అసౌకర్యం, చెమటను పెంచుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
తామర లాంటి పరిస్థితులు ఉన్నవారికి లోదుస్తులలో నిద్రించడం వల్ల చర్మంలో చిక్కుకున్న బ్యాక్టీరియా, ఈస్ట్ తేమ కారణంగా చికాకును పెంచుతుందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్కి దారి తీస్తుందని చెబుతున్నారు. చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఇలా జరుగుతుందంటున్నారు.
సింథటిక్ బట్టలు లేదా రంగులకు అలెర్జీ ఉన్న వ్యక్తులు దద్దుర్లు లేదా అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. వదులుగా ఉండే, కాటన్ లోదుస్తులను ధరించడం వల్ల గాలి బాగా ఆడుతుంది. మెరుగైన చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
సింథటిక్ లోదుస్తులను ధరించి నిద్రించడం వల్ల శరీరం సహజ ఉష్ణోగ్రత నియంత్రణలో సమస్యలు తలెత్తుతాయి. బిగుతుగా ఉండే లోదుస్తులు గాలి ప్రవాహాన్ని నిరోధిస్తాయి. పాలిస్టర్ వంటి సింథటిక్ బట్టలు వేడి, తేమను ట్రాప్ చేస్తాయి.
రాత్రిపూట అధిక వేడిని కలిగిస్తుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. చెమటలు లేదా చర్మం చికాకు సంభవించవచ్చు. కాటన్ వంటి సహజమైన బట్టలు లేదా లోదుస్తులు లేకుండా నిద్రించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం వేడి కూడా చాలా వరకు తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది.