Scorpion: ఊపిరి తీసుకోకుండా ఆరు రోజులు.. తినకుండా సంవత్సరం ఉండే జీవి

తేలు ఒక సంవత్సరం మొత్తం ఆహారం లేకుండా, ఆరు రోజులు శ్వాస తీసుకోకుండా బతుకుంతుందట. దీని ఊపిరితిత్తుల నిర్మాణం చాలా కాలం పాటు దాని శ్వాసను నిలిపి ఉంచగలదు.

scorpion

Scorpion

New Update

Scorpion: ప్రపంచంలోని అనేక రకాల జీవుల గురించి మనం విన్నాం. ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో జీవి జీవితకాలం ఒక్కోలా ఉంటుంది. కొన్ని వందల ఏళ్లు బతికితే మరికొన్ని కొన్ని క్షణాలే బతుకుతాయి. ఏకంగా ఆరు రోజులు శ్వాస తీసుకోకుండా.. ఏడాది పాటు ఏమీ తినకుండా ఉండగలిగే జీవి ఒకటి ఉంది. దాని గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

ఆహారం లేకుండా గడపగల జీవి:

మన జీవితంలో శ్వాస అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఊపిరి తీసుకోకుండా జీవించడాన్ని మనం ఊహించలేము. అయితే శ్వాస తీసుకోకుండా 6 రోజులు జీవించగలిగే ఒక జీవి ఉంది. అదే తేలు.. దీని ఊపిరితిత్తుల నిర్మాణం చాలా కాలం పాటు దాని శ్వాసను నిలిపి ఉంచగలదు. ఈ రకమైన ఊపిరితిత్తులను బుక్ లంగ్స్ అంటారు. వాటి ఆకారం పుస్తకంలోని మడతపెట్టిన పేజీల్లా ఉంటుంది. అందుకే వాటికి ఈ పేరు పెట్టారు. వాటి ఊపిరితిత్తులలో మంచి మొత్తంలో గాలిని నిలుపుకోవచ్చు. ఇది శ్వాస సమయంలో కూడా జరుగుతూనే ఉంటుంది. రిజర్వ్ మొత్తం గాలి కారణంగా గాలిని మార్పిడి చేయకుండా 6 రోజులు జీవించగలుగుతాయి. అంతే కాదు ఈ జీవిలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది ఒక సంవత్సరం మొత్తం ఆహారం లేకుండా గడపగలదు. అంతేకాకుండా తక్కువ నీరు తీసుకుంటుంది. జీవించడానికి దానికి నీరు అవసరం. సులభంగా ఎంత ఎత్తునైనా ఎక్కగలదు. అలాగే అతినీలలోహిత కాంతి పడినప్పుడు తేళ్లు మెరుస్తూ ఉంటాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

ఇది కూడా చదవండి:  పాదాలు పగిలి నడవలేకపోతున్నారా..?..ఇది ట్రై చేయండి

#food
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe