రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్‌ల దగ్గర, ప్లాట్‌ఫారమ్‌పై పసుపు చారలు ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ స్ట్రిప్‌ను రూపొందించడం వెనుక ప్రత్యేక ప్రయోజనం ఉంది.
రైల్వే ప్లాట్‌ఫారమ్‌లోని పసుపు గీత ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి, భద్రతను నిర్ధారించడానికి ఉంటుంది. రైళ్లు రాకపోకల సమయంలో ప్రయాణికులను ప్లాట్‌ఫారమ్‌కు దూరంగా ఉంచడం దీని లక్ష్యం.
ఒక ప్రయాణీకుడు ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్నప్పుడు ఈ బార్ దాటి ముందుకు వెళ్లడం ప్రమాదకరమని సూచిస్తుంది. తక్కువ దృష్టి సమస్యలు ఉన్నవారికి పసుపు గీత ప్రయోజనకరంగా ఉంటుంది.
రైలు వెళ్లే సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై బలమైన గాలి వీస్తుంది. ఇది ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే పసుపు గీతకు అవతలివైపు ఉండాలని అర్థం
ఈ స్ట్రిప్ రైల్వే భద్రతా ప్రమాణాలలో ఒక భాగం. దీనిని ప్రతి స్టేషన్లో ఉంచడం తప్పనిసరి. కాబట్టి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్నప్పుడు కచ్చితంగా పసుపు గీత దాటి వెళ్లకూడదు.
అలాగే ప్లాట్‌ఫారమ్ దగ్గర కొన్ని గుర్తులు, సింబల్స్‌ని రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో సిగ్నల్‌కు ఒక్కో హెచ్చరిక ఉంటుంది.