Radish: చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే శక్తివంతమైన కూరగాయలు ముల్లంగిలో పొటాషియం, ఆంథోసైనిన్ బీపీతోపాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అదనపు కొవ్వు. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో రకరకాల సమస్యలు. జీవనశైలి, ఆహార అలవాట్లతో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలాగే వదిలేస్తే ప్రాణాంతకం కావచ్చని నిపుణులు అంటున్నారు. 2/7 ఎక్కువగా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనుషుల్లో చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతోంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. 3/7 చలికాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్లో అందం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలం వచ్చిందంటే పచ్చి కూరగాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 4/7 గ్రీన్ వెజిటేబుల్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ముల్లంగిలో పోషకాలు అధికంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. 5/7 ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పొటాషియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 6/7 ముల్లంగిలో పొటాషియం, ఆంథోసైనిన్ ఉన్నాయి. ఇవి బీపీతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్, వాటర్ కంటెంట్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది 7/7 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #radish మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి