చలికాలంలో చర్మం పొడిబారడం ప్రధాన సమస్య. చల్లని గాలి, తక్కువ తేమ స్థాయిలు చర్మ సమస్యలకు దారితీస్తాయి. ఈ సీజన్లో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. లేకుంటే దద్దుర్లు, నల్లమచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది.
చల్లని వాతావరణం వల్ల దురద, దద్దుర్లు, మొటిమలు, జిడ్డు చర్మం, చికాకు మొదలైన అనేక సమస్యలు మనల్ని వేధిస్తాయి.
చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు చాలా సహాయపడుతుంది. రోజూ రాసుకోవడం వల్ల మీ ముఖం ఎప్పుడూ మెరుస్తుంది.
కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. కొబ్బరినూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల బాహ్య ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. సహజమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. కళ్ల కింద, పెదవుల వంటి సున్నిత ప్రాంతాలకు కొబ్బరినూనెను అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ ముఖం అందంగా మారుతుంది.
కొబ్బరినూనెలోని కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. చర్మం లోపల నుండి శుభ్రంగా మారుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.