చాలా మంది మోడల్స్ అందం కంటే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. సరైన ఆహారంతో పాటు రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఎల్లప్పుడూ ఫిట్‌గా కనిపిస్తారు. సెలబ్రిటీలంతా దాదాపు మంచి డైట్ మెయింటెన్ చేస్తుంటారు.
సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు ఉదయం అల్పాహారంలో గుడ్డులోని తెల్లసొన, ఆమ్లెట్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ లాంటివి తీసుకోవాలి. అంతేకాకుండా అల్పాహారంగా తాజా పండ్లు, బాదం పప్పులు తీసుకోవాలి.
మంచి శరీర ఆకృతి, మనసు ప్రశాంతత కోసం ప్రతి రోజూ యోగా చేయాలి, మెడిటేషన్ చేయడం కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జిమ్‌తో పాటు ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తుండాలి. కనీసం వారానికి మూడుసార్లు జిమ్‌కు వెళ్తే మంచి ఫిట్నెస్ ఉంటుంది.
భోజనంలో పప్పు, రోటీ, బ్రౌన్ రైస్, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. బ్రౌన్ రైస్‌లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం శక్తిని అందిస్తాయి. పప్పుల ద్వారా ప్రోటీన్, ఫైబర్ అందుతుంది.
రాత్రి భోజనంలో సలాడ్, కూరగాయలు, చేపలు, చికెన్ తీసుకున్నా పర్వాలేదని, కాకపోతే యోగాతో పాటు, జాగింగ్ చేయడంలాంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.