ఈ గుడ్లు తింటే క్యాన్సర్‌ ఖాయం!

ఈ మధ్య కోడిగుడ్ల ప్లేస్ లో నకిలీ గుడ్లు అమ్ముతున్నారు. వీటిని తినడం వల్ల ఊబకాయం, జీవక్రియ సమస్యలు, క్యాన్సర్, డయేరియా లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అసలు మార్కెట్లలో విక్రయించే నకిలీ గుడ్లను ఎలా గుర్తించాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

New Update

Plastic Eggs:  మార్కెట్లలో విక్రయించే చాలా రకాల ఆహార పదార్థాల్లో కల్తీ జరిగే ప్రమాదం ఉంది. చాలా మంది వాటిని స్వచ్ఛమైనవిగా భావించి మోసపోతున్నారు. ఇలాంటి వాటిలో కోడి గుడ్లు కూడా ఒకటి.  మార్కెట్ నుంచి కోడిగుడ్లను  కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య  కోడిగుడ్ల  ప్లేస్ లో నకిలీ గుడ్లు అమ్ముతున్నారు. ఈ నకిలీ గుడ్లను ఎలా తయారు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పొరపాటున ఇలాంటి గుడ్లను మాత్రం తింటే అనారోగ్యం బారిన పడినట్లే అని అంటున్నారు నిపుణులు. అయితే గుడ్డు నిజమైనదా? నకిలీదా అని తెలుసుకోవడానికి కొన్ని టెక్నీక్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also Read: 24ఏళ్ల తర్వాత తొలిసారి.. ప్రపంచ వేదికపై భారతీయ అందాల భామకు కిరీటం

నకిలీ గుడ్డును కనుక్కునే చిట్కాలు

అయితే మొదట గుడ్డు షెల్ ను చెక్ చేయాలి. నిజమైన గుడ్డు పెంకును కఠినంగా ఉంటుంది. అలాగే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి. అదే నకిలీ గుడ్డు విషయానికి వస్తే తేలికగా ఉంటాయి. నకిలీ గుడ్లను కనుక్కోవడానికి ఇంకో మార్గం కూడా ఉంది. కల్తీ గుడ్లను నీటిలో వేస్తే పైకి తేలుతాయి.. అదే నిజమైన గుడ్లు మునిగిపోతాయి. ఈ నకిలీ గుడ్లను ప్లాస్టిక్, ఇతర  హానికరమైన రసాయనాలతో తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల ఊబకాయం, జీవక్రియ సమస్యలు, క్యాన్సర్, డయేరియా లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. 

Also Read: Venkatesh: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

 సహజంగా గుడ్లు  తినడం ఆరోగ్యానికి చాలా  మంచిది. గుడ్డు ప్రోటీన్ కు గొప్ప మూలంగా పరిగణించబడుతుంది. అలాగే ఇందులో కాల్షియం, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేకూర్చినప్పటికీ.. మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: అరుణాచలంలో భర్తతో కలిసి శివజ్యోతి పూజలు.. ఫొటోలు వైరల్

Also Read: థియేటర్, ఓటీటీల్లో దీపావళి సందడి.. పండగకు రాబోతున్న సినిమాలివే

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe