Health Tips: ఈ ప్రదేశాలకు వెళ్తే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మంగళూరు నగరాల్లో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఇక్కడ చెట్లు, మొక్కలు, అడవులతో పాటు అందమైన ప్రకృతి గాలిలో విషపూరిత మలినాలు ఉండవు. స్వచ్ఛమైన గాలి కావాలంటే గ్యాంగ్‌టక్ నగరాన్ని ఎంచుకోవచ్చు. By Vijaya Nimma 24 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగా పెరిగిపోయింది. నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2/6 కొన్ని నగరాల్లో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. ఇక్కడ చెట్లు, మొక్కలు, అడవులతో పాటు అందమైన లోయలు ఉంటాయి. అందుకే ఇక్కడి గాలిలో విషపూరిత మలినాలు ఉండవు. 3/6 కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌కు వెళ్లవచ్చు. సగటున కిన్నౌర్ గాలిలోని పార్టికల్ స్థాయిలు 10శాతం తక్కువగా ఉంటాయి. 4/6 మీకు ప్రయాణం అంటే ఇష్టమైతే ఖచ్చితంగా మంగళూరును మీ జాబితాలో చేర్చాల్సిందే. అద్భుతమైన బీచ్‌ల నుండి పురాతన దేవాలయాలు, చర్చిలు, అద్భుతమైన వాస్తుశిల్పం, మంచి ఓడరేవులు అన్నీ ఇక్కడ ఉంటాయి. 5/6 దేశంలోని అద్భుతమైన ప్రదేశాలలో సిక్కిం ఒకటి. స్వచ్ఛమైన గాలి కావాలంటే గ్యాంగ్‌టక్ నగరాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడి గాలిలో తాజాదనం ఉంటుంది. 6/6 తమిళనాడులోని కాలుష్య రహిత నగరమైన పుదుచ్చేరికి వెళ్తే ఇతర దేశాలకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. స్వచ్ఛమైన గాలి కూడా ఇక్కడ దొరుకుతుంది. #tamil-nadu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి