పైనాపిల్ తింటే అంతే సంగతి!

పైనాపిల్ తీసుకోవడం అందరికీ ప్రయోజనకరంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ అలర్జీ ఉన్నవారు ఈ పండును తీసుకుంటే కడుపులో చికాకును ఎదుర్కుంటారు. అలాగే ప్యాంక్రియాటైటిస్ తో బాధపడుతున్న వ్యక్తులు కూడా పైనాపిల్‌కు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

New Update

Pinapple:  పైనాపిల్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. పుల్లపుల్లగా...తీయతీయగా ఉండే ఈ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొందరు మాత్రం దీనిని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ అంటే ఎలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది. అలర్జీ ఉన్నవారు పైనాపిల్ తినడం వల్ల కడుపులో చికాకును ఎదుర్కొంటారు. అంతేకాదు అసిడిటీ, అల్సర్ ఉన్నవారికి కూడా ఇది ఇబ్బందిని కలిగిస్తుంది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్యాంక్రియాటైటిస్ తో బాధపడుతున్న వ్యక్తులు కూడా పైనాపిల్‌కు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. 

Also Read: ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘స‌త్యం సుంద‌రం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

పైనాపిల్ ప్రయోజనాలు 

 పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాదు వాతావరణ మార్పుల కారణంగా సంభవించే అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పైనాపిల్‌లోని  బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే కడుపులో మంటను తగ్గిస్తుంది. చలికాలంలో పైనాపిల్ చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీనిలోని  విటమిన్ సి చర్మ కణాలను రిపేర్ చేసి మెరిసేలా చేస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారడం వంటి సమస్యలను కూడా  తగ్గిస్తుంది.

ప్రతి రోజు ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్థరైటిస్, కార్డియోవాస్కులర్ జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఒక కప్పు పైనాపిల్ రసం  73% మెగ్నీషియం కంటెంట్ ను శరీరానికి అందిస్తుంది. పైనాపిల్ చిగుళ్లు, దంతాల సంరక్షణ కోసం ఉపయోగపడుతుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe