రాత్రిపూట ఫోన్లు చూడటం, సరిగ్గా నిద్రపోకపోవడం వంటివి అలవాటుగా మారిపోయింది. దీని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.
నిద్రసరిగా లేకపోతే శరీరం అలసిపోవడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.జీర్ణక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది.
మన శరీరం రోజంతా పని చేస్తుంది. రాత్రి విశ్రాంతి అవసరం. పూర్తిగా విశ్రాంతి తీసుకోకపోతే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. మెదడుపై ఒత్తిడి పెరిగి జీర్ణవ్యవస్థ బలహీనపడుతుందని వైద్యులు అంటున్నారు.
20 నుంచి 50 ఏళ్లలోపు వారికి ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. చిన్న పిల్లలకు 9 నుంచి 12 గంటల నిద్ర అవసరం
తగినంత నిద్ర శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది, జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.
సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన జీవితానికి తగినంత నిద్ర కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.