Sunlight: మన భూమికి, మనకు సూర్యకాంతి చాలా ముఖ్యమైనది. సూర్యకాంతి లేకుండా భూమిపై జీవితాన్ని ఊహించలేము. సూర్యరశ్మి మానవులకు కూడా చాలా ముఖ్యమైనది. ఇది మన ఎముకలు, రక్త కణాలు, రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్-డిని ఇస్తుంది. కానీ సూర్యకాంతి ప్రజలకు శాపంగా మారిన గ్రామం కూడా భూమిపై ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు రాత్రిపూట మాత్రమే తమ ఇళ్ల నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే వారి చర్మం సూర్యరశ్మికి కాలిపోతుంది. బ్రెజిల్‌లోని ఒక గ్రామంలో ప్రజలు రాత్రిపూట మాత్రమే తమ ఇళ్ల నుంచి బయటకు వస్తారు. బ్రెజిల్‌లోని సావో పాలోలో ఉన్న ఈ గ్రామం పేరు అరరాస్. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, అందువల్ల వారు పగటిపూట పని చేయవలసి వస్తుంది. ఎండలో పనిచేయడం వల్ల అక్కడి ప్రజల చర్మం కరిగిపోయి చాలా వింతగా మారుతారు.
ఈ వ్యాధికి వివిధ కారణాలు:
ఈ గ్రామ ప్రజలు జిరోడెర్మా పిగ్మెంటోసమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. లక్షల్లో ఒకరికి వచ్చే ఇది చాలా అరుదైన వ్యాధి అయినప్పటికీ 800 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 600 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి కారణంగా ఆ వ్యక్తులలో చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. గ్రామంలోని ప్రజలు ఈ వ్యాధికి వివిధ కారణాలను చెబుతారు. కొందరు ఇది లింగ సంబంధిత వ్యాధి అని అంటారు. కొందరు ఇది వంశపారంపర్యమని చెబుతారు. ఈ గ్రామ ప్రజలు దీనిని దేవుని శాపంగా భావించి జీవిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రజలు ఈ వ్యాధి గురించి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: నడుంనొప్పి కంటిన్యూగా వస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు
యువ తరాలకు దాని ప్రాథమిక లక్షణాలు, దానిని నివారించే మార్గాల గురించి అవగాహన కల్పించారు అధికారులు. అందుకే ఈ వ్యాధి బారిన పడకుండా పగటిపూట నిద్రించి. రాత్రి సమయంలో మాత్రమే పనులు చేసుకుంటుంటారు. చాలా స్వచ్ఛంద సంస్థలు ఈ గ్రామాన్ని సందర్శించి తగిన మందులు, వైద్య సహాయం అందిస్తున్నాయి. కొందరు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస కూడా వెళ్లిపోయారు. సొంత గ్రామాన్ని విడిచిపెట్టలేక మరికొందరు అలాగే కాలం వెల్లదీస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కరివేపాకు నీటితో ఎంతటి పొట్ట అయినా కరగాల్సిందేనా?