Health Tips: ఉదయం మూత్రం పసుపుగా వస్తోందా..కారణమిదే

మూత్రం పసుపు రంగులోకి మారడం అనేది శరీరం పరిస్థితి. పసుపు మూత్రం వస్తే మీరు నిర్జలీకరణానికి గురయ్యారని, మూత్రపిండాలు శుభ్ర పరచుకోలేక పోతున్నాయని కూడా అర్థం. నిమ్మ, వెల్లుల్లి, పుచ్చకాయ, దోసకాయ, అల్లం, ద్రాక్ష, తోటకూర, పైనాపిల్ వంటివి తినాలి.

New Update
yellow urine

yellow urine Photograph

Health Tips: పసుపు రంగు మూత్రం శరీరంలో నీరు తక్కువగా ఉందని సూచిస్తుంది. కానీ కొన్నిసార్లు కారణాలు వేరే ఉంటాయి. నిజానికి మూత్రం పసుపు రంగులోకి మారడం అనేది శరీరం పరిస్థితి. దీనిలో యూరోక్రోమ్ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం కావడం దీనికి కారణం. అదనంగా కొన్ని విటమిన్లు, మందులు, ఆరోగ్య పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు. ఉదయం పసుపు మూత్రం శరీరంలోని కొన్ని సమస్యలకు సంకేతంగా చెబుతున్నారు. 

కిడ్నీలో టాక్సిన్స్ పేరుకుపోయి:

ఈ కారణాలలో ఒకటి కాలేయంలో ఇన్ఫెక్షన్ కూడా కావొచ్చు. నిజానికి ఇది కాలేయం సరిగా పనిచేయడం లేదని, మూత్రంలో విషపదార్థాలు ఉండొచ్చని అంటున్నారు. ఇలా జరిగితే విస్మరించకూడదని, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దట్టమైన పసుపు మూత్రం వస్తే మీరు నిర్జలీకరణానికి గురయ్యారని, మూత్రపిండాలు శుభ్రపరచుకోలేకపోతున్నాయని కూడా అర్థం. దీని వల్ల కిడ్నీలో టాక్సిన్స్ పేరుకుపోయి పసుపు రంగులో మూత్రం రూపంలో బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని విస్మరించవద్దు.  వైద్యుడిని ఒకసారి సంప్రదించాలి. అలాగే ఏదైనా సమస్య ఉంటే సకాలంలో చికిత్స చేయించుకోవాలి.

మూత్రపిండాలు, కాలేయం రెండింటి పనితీరును నిర్వహించడానికి తగినంత నీరు తాగాలి.  వీలైనంత ఎక్కువ ద్రవాలను తీసుకోవడానికి ప్రయత్నించాలి. మూత్రవిసర్జన, మూత్ర ప్రవాహాన్ని మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడే ఆహారాలను తీసుకోవాలి. కొబ్బరి నీరు లేదా పుదీనా రసం వంటివి తీసుకోవాలి. నిమ్మ, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరపకాయ, పుచ్చకాయ, దోసకాయ, అల్లం, ద్రాక్ష, తోటకూర, పైనాపిల్ వంటివి తినాలని వైద్యులు చెబుతున్నారు.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:
గుండెలోని బ్లాక్‌లను తొలగించే అద్భుతమైన పానీయం

Advertisment
తాజా కథనాలు