ఎక్కువగా వర్క్ చేసిన లేదా అనారోగ్య సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. కొందరికి అయితే ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తుంది. ఉదయం పూట తలనొప్పి వస్తే రోజంతా కూడా చిరాకుగా ఉంటుంది. పొద్దున్న సమయంలో ఎంత యాక్టివ్‌గా ఉంటే రోజంతా అంతా ఫ్రీగా ఉంటారు. అయితే రోజూ కూడా ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు. మరి లేచిన వెంటనే తలనొప్పి రావడానికి అసలు కారణాలేంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని..
స్లీప్ అప్నియాతో బాధపడేవారు..
లేచిన వెంటనే తలనొప్పి రావడానికి ముఖ్య కారణం నిద్ర లేకపోవడం. రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోతే అది కాస్త తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది. అయితే రోజూ కూడా ఇదే సమస్య ఉంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు స్లీప్ అప్నియాతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి కూడా ఉదయం పూట కచ్చితంగా తలనొప్పి వస్తుంది.
ఇది కూడా చూడండి: డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ
తలనొప్పి నుంచి విముక్తి పొందాలంటే రాత్రిపూట బాగా నిద్రపోవాలి. కొందరు ఆలస్యంగా పడుకుని లేస్తారు. దీనివల్ల పడుకున్న ఫీలింగ్ ఉండదు. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. కాబట్టి తొందరగా నిద్రపోయి, లేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి తలనొప్పి కూడా మిమ్మల్ని దరిచేరదు.
ఇది కూడా చూడండి: BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 7ఏళ్ల జైలు శిక్ష!
బాడీకి సరిపడా నీరు, ఫుడ్ లేకపోవడం వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. దీంతో ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తుంది. అదే ఎక్కువగా నీరు తాగి, బాడీ హైడ్రేట్‌లో ఉంచుకుంటే తలనొప్పి తగ్గుతుంది. రాత్రి నిద్రపోయే ముందు లేచిన తర్వాత గ్లాసు నీరు తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్ పర్యటనలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.