Mental Health: మానసిక ఆరోగ్యంలో అనేక రకాలు ఉన్నాయి. ఎవరికైనా గుండె నొప్పి, కడుపునొప్పి, తలనొప్పి ఉంటే వాటికి ఎన్నో టాబ్లెట్స్ ఉంటాయి. కానీ మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే పెద్దగా మందులు ఏమీ ఉండవు. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి ఇలాంటి చాలా రకాల మానసిక సమస్యలు ఉన్నాయి. డిప్రెషన్‌లో అధిక విచారం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, ఆకలి లేదా నిద్ర సమస్యలు ఇలాంటివి మానసిక సమస్యలుగా వైద్యులు చెబుతారు. బై పోలార్ డిజాస్టర్ అనేది ఒక రకమైన మానసిక స్థితి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. కొన్నిసార్లు ఓ మనిషి అకస్మాత్తుగా చిరాకుగా ఉంటాడు. ఈ బైపాస్ డిజాస్టర్ ఉంటే ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. మానసిక సమస్యల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మానసిక సమస్యలు ఎన్ని రకాలు..?
OCD:
- ఇదో రకమైన మానసిక సమస్య. ఇందులో పరిశుభ్రత లేకపోవడం వల్ల చిరాకు పడుతుంటారు. అంతేకాకుండా ఎంతో కోపం వస్తుంది. ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు.
తినే రుగ్మత:
- ఈటింగ్ డిజాస్టర్ కూడా ఒక రకమైన మానసిక సమస్య. ఇది ఉన్నవారికి చాలా ఆకలిగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరగడం, తగ్గడం లాంటి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
న్యూరో డిజాస్టర్:
- ఇది ఉన్నవారికి బాల్యంలో లేదా చిన్నతనంలో ఆర్టిజం సమస్యలు ఉంటాయి.
చిత్త వైకల్యం:
- ఇది సాధారణంగా వృద్ధుల్లో వస్తుంది. మానసిక ఆరోగ్య సమస్య, దీనిలో జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిద్రపోయే సామర్థ్యం తగ్గడం. వాస్కులర్ డిమాన్షియా వంటి సమస్యలు తలెత్తవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సనాతన ధర్మం ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి..?