/rtv/media/media_files/2025/02/23/RyleYv3O0xcWcGHCkUcF.jpg)
Maha Sivaratri 2025
Mahashivratri 2025: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు శివలింగానికి జలాభిషేకం, రుద్రాభిషేకాలు జరిపిస్తారు. ఇలా చేయడం వల్ల పుణ్యం వస్తుందని, శివుని దయతో దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతారు. పంచాంగం ప్రకారం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి తిథి ఫిబ్రవరి 26, 2025న ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 27న ఉదయం 08:54 వరకు శివరాత్రి ఉంటుంది. ఉదయ తిథి తేదీ ప్రకారం ఫిబ్రవరి 26న ఉపవాసం, పూజలు నిర్వహిస్తారు.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
పూజకు శుభ సమయం:
మహా శివరాత్రి రోజున రాత్రిపూట పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నిషిత పూజకు శుభ సమయం రాత్రి 12:09 నుంచి 12:59 వరకు ఉంటుంది. తంత్రం, మంత్రం, సాధన పరంగా ఈ సమయం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి పూజ సాయంత్రం 06:19 నుంచి రాత్రి 09:26 వరకు చేసుకోవచ్చు. రెండవ జాము రాత్రి 09:26 నుంచి అర్ధరాత్రి 12:34 వరకు, మూడవ జాము మధ్యాహ్నం 12:34 నుంచి 3:41 వరకు, నాలుగో జాము 27వ తేదీ ఉదయం 03:41 నుంచి 06:48 వరకు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
Also Read: ఈ ఆహారాలు పిల్లలకు ఇస్తే కంటి చూపు రెట్టింపు
మహా శివరాత్రి రోజున భక్తులు శివలింగానికి జలాభిషేకం చేస్తారు. దీనికి బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్రమైనదిగా చెబుతున్నారు. భక్తులు తమ సౌకర్యాన్ని బట్టి రోజులో ఏ సమయంలోనైనా రుద్రాభిషేకం చేసుకోవచ్చని పండితులు అంటున్నారు. మహా శివరాత్రి ఉపవాసం ఆచరించే భక్తులు ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 06:48 నుంచి 08:54 వరకు ఉపవాసం విరమించవచ్చు. మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండి విశ్వాసంతో పూజించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.