Stray Dogs: విశ్వాసానికి మారుపేరైన కుక్కలు ఎందుకు కరుస్తాయి? అసలు వాటికి కోపం ఎందుకు వస్తుందో తెలుసా?

ప్రస్తుతం వీధి కుక్కల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో జంతు ప్రియులు, కుక్కలను పెంచుకునేవారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మనుషుల పట్ల ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉండే కుక్కలు.. కొన్ని సార్లు ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తాయి?అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. . 

New Update
telangana Stray dogs attack 25 people in Medak district Thupran

stray dogs

Stray Dogs: ఈ మధ్య దేశంలో వీధి కుక్కల దాడులు బాగా పెరిగిపోయాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా కనిపించే చిన్న పిల్లలు, వృద్దులు, మహిళలు వీటికి లక్ష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే దేశంలో వీధి కుక్కల దాడికి బలైన ఘటనలు చాలానే ఉన్నాయి. ఢిల్లీ, NCR వంటి ప్రాంతాల్లో కుక్క కాటు కేసులు, ర్యాబిస్ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది వారాల్లోపు ఢిల్లీలోని కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ, సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వీధి కుక్కల విషయంలో కోర్టు తీర్పును సమర్దిస్తుండగా.. జంతు ప్రేమికులు, జంతు సంరక్షణ కార్యకర్తలు మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. కుక్కలను ఉంచడానికి ప్రభుత్వం దగ్గర తగినంత నిధులు, హోమ్ లు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని అలా సామూహికంగా బంధించడం సరైన పరిస్కారం కాదని అంటున్నారు. 

ప్రస్తుతం ఈ కుక్కల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో జంతు ప్రియులు, కుక్కలను పెంచుకునేవారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మనుషుల పట్ల ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉండే కుక్కలు.. కొన్ని సార్లు ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తాయి? అవి అంత భయంకరంగా మనుషుల పై దాడి చేయడానికి కారణమేంటి? వాటికి ఎందుకు కోపం వస్తుంది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. . 

కుక్కలు ఎందుకు క్రూరంగా ప్రవర్తిస్తాయి

భయం 

కుక్కలు కూడా మనుషుల మాదిరిగానే భయానికి గురవుతాయి. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొత్త మనుషులను చూసినప్పుడు, తెలియని వాసనలు వచ్చినప్పుడు భయంతో అరవడం మొదలు పెడతాయి. ఆ సమయంలో ఎవరైనా వాటి దగ్గరకు వెళ్తే. భయపడిపోయి ఆత్మ రక్షణ కోసం కరవడానికి ప్రయత్నిస్తాయి. 

ఆరోగ్య సమస్యలు

కుక్కలకు ఏదైనా నొప్పి లేదా అనారోగ్యంతో బాధపడుతుంటే  అవి కోపంగా ఉంటాయి. ఉదాహరణకు, కీళ్ల నొప్పులు, చెవి ఇన్ఫెక్షన్లు లేదా దంతాల సమస్యలు ఉన్నప్పుడు వాటిని ముట్టుకుంటే కోపంతో కరిచే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాటిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.

ప్రాంతాన్ని రక్షించుకోవడం

ఎవరైనా అపరిచితులు తమ ప్రాంతంలోకి వస్తే కుక్కలు దూకుడుగా ప్రవర్తిస్తాయి. వారు తమకు హానీ కలిగిస్తారేమోననే భయంతో దాడికి పాల్పడతాయి. అలాగే  కొత్త వాళ్లు ఇంట్లోకి వచ్చినప్పుడు లేదా మరో జంతువు దగ్గరకు వచ్చినప్పుడు కూడా అరవడం మొదలు పెడతాయి. అరుస్తూ ఆ ప్రాంతం తమదేనని చెప్పుకుంటాయి. 

సరైన శిక్షణ 

కుక్కకు చిన్నప్పటి నుంచి సరైన శిక్షణ లేకపోవడం.. వాటిని పదేపదే కొట్టడం వల్ల వాటి స్వభావం క్రూరంగా మారుతుంది. అలాంటి కుక్కలు ప్రజలు దగ్గరకు రాగానే భయపడిపోయి కరవడం చేస్తుంటాయి. అలాగే కుక్కలు ఎక్కువసేపు ఒంటరిగా ఉండడం వల్ల ఒత్తిడి, నీరసానికి గురవుతాయి. ఈ సమయంలో వాటికి చిరాకు కలిగి క్రూరంగా ప్రవర్తించవచ్చు. సరైన ఫుడ్, వాటర్ లేకపోవడం వల్ల కూడా కుక్కలు చిరాకుపడి కరుస్తాయి. 

Advertisment
తాజా కథనాలు