/rtv/media/media_files/Sq434ddM3xjpywe3UxQ4.jpeg)
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి కాస్త రిలాక్స్ అయ్యే సమయం కూడా దొరకడం లేదు. రోజంతా ఇంటి పనులు, ఆఫీస్ పనులు అంటూ బిజీగా గడిచిపోతుంది. దీని కారణంగా ఒత్తిడికి గురవడం, మానసిక ఆరోగ్యం పాడవడం జరుగుతుంది. అయితే తాజాగా ఒత్తిడికి సంబంధించి ఓ సర్వే నిర్వహించగా .. పురుషులు కంటే స్త్రీలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/stress-jpg.webp)
సాధారణంగా కుటుంబ బాధ్యతలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ పురుషులు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని అనుకుంటారు. కానీ అధ్యనాల్లో షాకింగ్ నిజాలు తెలిసాయి. ఎమోషనల్ వెల్నెస్ పేరుతో చేసిన ఒక సర్వేలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్లు తెలిసింది.
/rtv/media/media_files/stressll2.jpeg)
ఈ పరిశోధన కోసం నిపుణులు.. వ్యక్తిగతంగా, జాబ్ పరంగా పురుషులు, మహిళలు ఎలాంటి మానసిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో తెలుసుకోవడానికి 5000 మందిని ప్రశ్నించారు.
/rtv/media/media_files/stressbb2.jpeg)
ఇందులో దాదాపు 72 శాతం మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. పురుషుల్లో కేవలం 53 శాతం మంది మాత్రమే ఒత్తిడికి గురవుతున్నారు.
/rtv/media/media_files/stressgg2.jpeg)
అయితే ఈ ఒత్తిడికి గల కారణాలను విశ్లేషించగా.. పురుషులు కేవలం వర్క్ లైఫ్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తారు. పిల్లలు, ఇంట్లో పనులపై పెద్దగా శ్రద్ధ చూపరు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stress-6-jpg.webp)
అదే స్త్రీల విషయానికి వస్తే.. ఓ వైపు ఇంటి పనులు, బాధ్యతలు చక్కబెడుతూనే.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలను కూడా నెరవేస్తూ సతమతం అవుతుంటారు.
/rtv/media/media_files/stresshh2.jpeg)
ఇది మాత్రమే కాదు పని ప్రదేశాల్లో భావం వంటివి అంశాలు కూడా 20 శాతం మంది మహిళల్లో మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయని నిపుణులు తెలిపారు.
/rtv/media/media_files/stressaa2.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.