అమ్మాయిల చేతుల అందాన్ని పెంచడంలో నెయిల్ పాలిష్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం మహిళలు రకరకాల నెయిల్ పాలిష్ లను కొనుగోలు చేస్తారు.
అయితే సాధారణంగా నెయిల్ పాలిష్ ఖరీదు 40- 5ఓ రూపాయలు లేదా మరీ బ్రాండెడ్ అయితే ఒక వేలల్లో ఉండొచ్చు. కానీ ఒక నెయిల్ పాలిష్ ఖరీదు కోట్లలో ఉంటుంది అంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది నిజమే. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈ నెయిల్ పాలిష్ ని లాస్ ఏంజెల్స్ డిజైనర్ అఙాథూర్ అజాతుర్ పోగోస్యాన్ రూపొందించారు. ఈ నెయిల్ పాలిష్ పేరు అజాచర్.
ఇది నలుపు రంగులో ఉంటుంది. అయితే దీనిలో 267 క్యారెట్ల నల్లని వజ్రాలు పొడగబడి ఉంటాయి. ఇలా చాలా స్పెషల్ అలాగే విలాసవంతమైనది.
ఈ ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ ధర దాదాపు రూ.1.9 కోట్లు ఉంటుంది. దీనిలో వజ్రాలు పొడగబడి ఉంటాయి అందుకే అంత ఖరీదు.
అంతేకాదు దీని తయారీలో ఉపయోగించే ప్లాటినం పౌడర్, ప్రత్యేకంగా రూపొందించిన సీసాల కారణంగా ప్రసిద్ధి చెందింది.
ఇది అందాన్ని పెంచడమే కాకుండా లగ్జరీ, హై క్లాస్‌కి సంకేతంగా ఉంటుంది.
ప్రత్యేక ఫంక్షన్ లు, ఫ్యాషన్ షోలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఈ నెయిల్ పాలిష్ సీసాలు ప్రత్యేకమైన డిజైన్లను కలిగి ఉంటాయి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.