pregnancy tips: తెలివైన, ఆరోగ్యమైన బిడ్డ కోసం ఇలా చేయండి..?

గర్భధారణ సమయంలో కొన్ని విషయాల పట్ల  జాగ్రత్త  వహిస్తే..  పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా  తెలివైనదిగా  ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

New Update
pregnancy soft drinks

pregnancy soft drinks

గర్భధారణ సమయంలో ప్రతి తల్లి తన బిడ్డ ఆరోగ్యంగా, అందంగా, తెలివిగా పుట్టాలని  కోరుకుంటుంది. ఇందులో చాలా విషయాలు జీన్స్ పై ఆధారపడి ఉంటాయి. అయితే గర్భధారణ సమయంలో కొన్ని విషయాల పట్ల  జాగ్రత్త  వహిస్తే..  పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా  తెలివైనదిగా  ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

బ్యాలెన్స్డ్ డైట్ 

గర్భధారణ సమయంలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా పుట్టబోయే బిడ్డ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి తగినంత విటమిన్లు, ప్రోటీన్లు అందించే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్,  పాల ఉత్పత్తులను సమృద్ధిగా తినాలి. 

మృదువైన సంగీతం 

 గర్భధారణ సమయంలో స్త్రీ తేలికపాటి సంగీతాన్ని వింటే..  గర్భంలో పెరుగుతున్న శిశువు తెలివితేటలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతారు.  కానీ హెడ్‌ఫోన్‌లు ధరించి అధిక వాల్యూమ్‌లో సంగీతం వినకూడదని గుర్తుంచుకోండి.

చెడు విషయాలకు దూరంగా

 గర్భధారణ సమయంలో ప్రతికూల విషయాలు,  ప్రతికూల ఆలోచనలు మీకడుపులో పెరుగుతున్న బిడ్డపై కూడా చెడు  ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల, గర్భధారణ సమయంలో  మనస్సును ప్రశాంతంగా,  సానుకూలంగా ఉంచుకోవాలి. నెగటివ్ గా మాట్లాడకూడదు, అలాగే నెగటివ్ విషయాలకు దూరంగా ఉండాలి. 

యోగా, ధ్యానం చేయండి

ప్రెగ్నెన్సీ  సమయంలో వైద్యుడిని సంప్రదించిన తర్వాత, మీ దినచర్యలో చిన్న చిన్న యోగాసనాలు ధ్యానాన్ని చేర్చుకోండి. యోగా, ధ్యానం చేయడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  గర్భధారణ సమయంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై  సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

మాట్లాడడం

పురాణాల ప్రకారం..  గర్భంలో పెరుగుతున్న అభిమన్యుడు తన తల్లిదండ్రుల మాట విని యుద్ధ కళను నేర్చుకున్నాడు. ఇది చాలా వరకు నిజమని నమ్ముతారు.  గర్భంలో పెరుగుతున్న శిశువు మీరు చెప్పేది వింటుంది, అర్థం చేసుకుంటుంది. అందుకే గర్భధారణ సమాయంతో శిశువుతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే పుస్తకాలు చదవడం చేయాలి.  ఇది  బిడ్డ మానసిక వికాసాన్ని  బలపరుస్తుంది.

latest-news | pregnency-women | telugu-news

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు