Life Style: దేవుడి విగ్రహం విరిగిపోవడం చెడుకు సంకేతమా? విరిగిపోతే ఏం చేయాలి

జోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో అకస్మాత్తుగా దేవుడి విగ్రహాలు విరిగిపోవడం, కింద పడడం అశుభంగా భావిస్తారు. అయితే విరిగిన విగ్రహాలను వెంటనే ఇంటి నుంచి తొలగించాలి. వీటిని అలాగే పూజించడం ఇంటికి శుభ ప్రదం కాదని జోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

lord

lord

New Update

Life Style: హిందూ మతంలో పూజలకు, సంప్రదాయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది తమ భక్తిని బట్టి ప్రతిరోజూ పూజలు చేస్తే.. మరికొందరు  పండగలు, ప్రత్యేకమైన రోజు మాత్రమే పూజలు చేస్తారు.  నిత్యం పూజలు చేయడం వల్ల దేవుడి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. పూజలు చేయడం మాత్రమే కాదు ఇంట్లోని పూజ గదిని, దేవుడి విగ్రహాలను కూడా నిత్యం శుభ్రంగా పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే కొన్ని సందర్భాల్లో పూజ గదిలోని విగ్రహాలను శుభ్రం చేసేటప్పుడు పొరపాటున చేయి జారడం, విరిగిపోవడం జరుగుతుంది. ఇలా జరగడం అశుభంగా భావిస్తారు. ఒకవేళ దేవుడి విగ్రహాలు పొరపాటున చేయిజారి కింద పడితే, విరిగిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.. 

 Also Read: Jani Mater: తన డ్యాన్స్‌తో టాలీవుడ్‌ను ఊపేసిన జానీ మాస్టర్‌ను కిందపడేసిన స్టెప్ ఇదే..!


దేవుడి విగ్రహం విరిగిపోవడం చెడుకు సంకేతమా?  

  • వాస్తు, హిందూ శాస్త్రం ప్రకారం.. ఇంట్లో దేవుడు విగ్రహం విరిగిపోతే.. ముందుగా దానిని ఇంటి నుంచి తొలగించాలి. విరిగిన విగ్రహాన్ని ప్రవహించే నీటిలో లేదా, ఎవరూ తొక్కని ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలి. విరిగిన దేవుడి పటాలను, విగ్రహాలను పూజించడం శుభ ఫలితాలను ఇవ్వదు. అకస్మాత్తుగా చేతి నుంచి విగ్రహం పడిపోవడం ఇంట్లో ప్రతికూలను సూచిస్తుంది. 
  • విరిగిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు. అంతే కాదు విరిగిన దేవుడి పటాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గొడవలు మొదలయ్యే ప్రమాదం ఉంటుందట. చేతి నుంచి ఆకస్మాత్తుగా దేవుడి విగ్రహం పడిపోవడం భవిష్యత్తులో జరగబోయే కొన్ని అవాంఛనీయ సంఘటనలకు సూచనగా చెబుతారు. 
     
    విరిగిన విగ్రహాన్ని ఎక్కడ వేయాలి
  • విరిగిన విగ్రహాలను ఏదైనా ప్రవహించే నదిలో  వేయండి. ఫోటో ఫ్రేమ్ విరిగిపోయినట్లయితే, దాని నుంచి దేవుని చిత్రాన్ని తీసి.. గాజును పడేయండి. పూజ గదిలో పగిలిన గాజు ఫ్రేమ్‌లో దేవత చిత్రాన్ని ఉంచడం అశుభం.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

Also Read: Sleep: పగటి పూట నిద్ర పొతే మీ బతుకు బస్టాండ్ అవుతుందా? ఇందులో నిజమెంత?

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe