Jani Mater: తన డ్యాన్స్‌తో టాలీవుడ్‌ను ఊపేసిన జానీ మాస్టర్‌ను కిందపడేసిన స్టెప్ ఇదే..!

కొరియోగ్రాఫర్‌గా, పవన్‌ సపోర్టర్‌గా తెలుగునాట ఫేమసైన జానీ మాస్టర్‌ జీవితం ఇంతలా తలకిందులవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ కెరీర్‌ టాప్‌ నుంచి ఒక్కసారిగా కిందకు ఎలా పడిందో తెలుసుకునేందుకు ఆర్టిక్‌లోకి వెళ్లండి.

New Update
jani master (3)

jani master

డీ షోతో కెరీర్ మొదలు పెట్టిన జానీ అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. సౌత్ టూ నార్త్ లోని స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేశాడు. ఇండియన్ మైకేల్ జాక్సెన్ ప్రభుదేవాకు కూడా చేత కూడా స్టెప్పులేయించే స్థాయికి వెళ్ళాడు. డాన్సులో తన ప్రత్యేకమైన స్టైల్, గ్రెస్ జానీకి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. 

జానీ కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలోనే తన టాలెంట్ తో దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కించుకున్నాడు. 2010 లో రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న' సినిమాలో  'రాయే రాయే రాయే సలోని' పాటతో తన టాలెంట్ నిరూపించుకున్న జానీ.. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. వరుస అవకాశాలు తనను వరించాయి. స్టార్ హీరోలకు కూడా కొరియోగ్రఫీ చేయడం మొదలు పెట్టాడు. 

2012లో అల్లు అర్జున్ జులై  సినిమాలో  'ఇంటికి ముందో గేటు' పాటలో జానీ స్టెప్పులు ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ పాటలో జానీ కొరియోగ్రఫీకి నంది అవార్డు వరించింది. ఆ తర్వాత తెలుగులో  'డిల్లకు డిల్లకు' సాంగ్,  సినిమా చూపిస్త మావా,  రామ్ చరణ్ తో 'జిల్ జిల్ జిగేలు రాణి'  జానీ ఇమేజ్ మరింత పెంచాయి.   

కోలీవుడ్, బాలీవుడ్ లోనూ జానీ సత్తా 

టాలీవుడ్ లో స్టార్  కొరియోగ్రాఫర్ గా రాణిస్తూనే బాలీవుడ్, కోలీవుడ్ లోనూ తన సత్తా చాటడం మొదలు పెట్టాడు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కోలీవుడ్ లో రజినీకాంత్, పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలకు సూపర్ హిట్ పాటలను కొరియోగ్రఫీ చేశాడు.  ''బుట్టబొమ్మ'', "రౌడీ బేబీ", "మేగం కారుక్కత",  ''రా నువ్వు కావాలా",  "అరబిక్ కుత్తు" పాటల్లో తన సిగ్నేచర్ స్టెప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించాయి. 'మేగం కారుక్కత' పాటతో  నేషనల్ అవార్డు గెలుచుకున్న తొలి సౌత్ ఇండియన్ కొరియోగ్రాఫర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. 

పీక్ స్టేజ్ లో జానీ కెరీర్.. రాజకీయాల్లో ఎంట్రీ  

కొరియోగ్రాఫర్ గా కెరీర్  పీక్ స్టేజ్‌లో ఉండగా.. 2024లో రాజకీయాలు వైపు టర్న్ తీసుకున్నాడు జానీ. మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు  వీరాభిమానైన  జానీ మాస్టర్.. పొలిటికల్ పరంగా కూడా ఆయనతోనే అడుగులు వేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో జనసేన తరుపున తన సొంత నియోజక వర్గం నెల్లూరులో  ప్రచారం చేశాడు. అంతేకాదు పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. జానీ నృత్య సారథ్యంలో వచ్చిన జంగ్ సైరన్ పొలిటికల్ సాంగ్ జనసేన శ్రేణులు, పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది.

లైంగిక ఆరోపణలు 

ఇటు సినిమా, రాజకీయాలతో జానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా.. ఆయన పై లైంగిక ఆరోపణలు రావడం జానీ జీవితాన్ని కుదిపేసింది. అతని దగ్గర పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ జానీ తనను కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టడం ఇండస్ట్రీలో తీవ్ర దూమారం రేపింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై  పోలీసులు IPC 376, 323, 506 సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో కేసు కూడా నమోదు చేశారు.ప్రస్తుతం జానీని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇలా జరగడంతో ఇండస్ట్రీలో జానీ సంపాదించుకున్న పేరు, మర్యాద అన్ని ఒక్కసారిగా పడిపోయాయి. అందుకే అంటారు.. జీవితంలో పేరు, ప్రతిష్టలు సంపాదించడం చాలా కష్టం.. కానీ అవి పోవడానికి మనం చేసే చిన్న పొరపాటు చాలని 

Advertisment
తాజా కథనాలు