/rtv/media/media_files/2025/03/22/U1uuw26wRkRvC4pgOBwi.jpg)
nebulizer for kids
Nebulizer: సాధారణంగా పిల్లలు జలుబు చేసినప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినప్పుడు నెబ్యులైజర్ ఉపయోగించమని వైద్యులు సిఫార్సు చేస్తారు. నెబ్యులైజర్ స్టీమ్ తీసుకోవడం పిల్లలకు జలుబు, ముక్కుదిబ్బడ, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. వైద్యులు సూచించిన మందును నెబ్యులైజర్ లో వేసి ఆవిరి పిల్లలకు ఆవిరి పెడతారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు వైద్యుడి అనుమతి లేకుండా తరచూ నెబ్యులైజర్ వాడడం చేస్తుంటారు. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రిస్క్రిప్షన్‌ను లేకుండా నెబ్యులైజర్ వాడడం వల్ల కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకోండి..
నష్టాలు
నెబ్యులైజర్ ఎప్పుడు ఇస్తారు?
డాక్టర్ స్టెతస్కోప్‌తో పిల్లల గుండె శబ్దాన్నిపరీక్షించిన తర్వాత.. దానికి అనుగుణంగా నెబ్యులైజర్ సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే మీ సొంత నిర్ణయాలతో నెబ్యులైజర్ పెడితే పిల్లవాడికి దిగువ వాయుమార్గంలో సమస్య ఉందా? లేదా ఎగువ వాయుమార్గంలో సమస్య ఉందా? అనేది మీరు తెలుసుకోలేరు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలకు హానీ కలిగించవచ్చు.
స్టెరాయిడ్ దుష్ప్రభావాలు
శిశువు నెబ్యులైజర్‌లో వేసే మందులకు కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. వైద్యుడిని సంప్రదించకుండా ఈ మందులను పదే పదే వాడటం వల్ల పిల్లవాడు మరింత అనారోగ్యానికి గురవుతాడు.
న్యుమోనియా వచ్చే ప్రమాదం
నెబ్యులైజర్ పైపులో నీటి వల్ల తేమగా ఉంటుంది. దీని కారణంగా అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనిని స్టెరిలైజ్ చేయకుండా వాడడం ద్వారా.. ఆ బ్యాక్టీరియా పిల్లల ఛాతీలోకి వెళ్తుంది. తద్వారా బిడ్డకు న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉంది.
పదే పదే వాడడం
జలుబు, దగ్గు కోసం పదే పదే నెబ్యులైజర్‌లను ఉపయోగించడం ద్వారా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వైద్యుడిని సంప్రదించి.. అవసరమైన పరిస్థితిలో మాత్రమే నెబ్యులైజర్ వాడాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
telugu-news | latest-news
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి:Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!