/rtv/media/media_files/2025/10/14/liver-damage-symptoms-2025-10-14-16-15-20.jpg)
liver damage symptoms
శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. రక్తంలోని విష పదార్థాలను, వ్యర్థాలను శుద్ధి చేయడం, శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను తయారు చేయడంలో తోడ్పడుతుంది. అలాగే శరీరంలోని కొవ్వులను జీర్ణం చేయడానికి, నిల్వ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే ఇది శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే కొంతమంది కాలేయ వ్యాధి చివరి దశకు చేరుకునే వరకు గుర్తించలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని లక్షణాలు ద్వారా కాలేయ సమస్యలను గుర్తించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
కాలేయ వ్యాధి లక్షణాలు
సారణంగా కాలేయ వ్యాధి లక్షణాలు కళ్ళు, కాళ్ళు, చేతులు, కాళీ వేళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కాలేయం దెబ్బతిన్నప్పుడు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారిపోవడం, మలం రంగు మారడం, చీలమండలు, ఉదరం వాపు, తీవ్రమైన అలసట, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం కాలేయ వ్యాధికి ప్రధాన సంకేతాలు
చేతులు రంగు మారడం..
చేతులు ఎరుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కూడా కాలేయ అనారోగ్యానికి సంకేతం. ఇలా చేతులు ఎరుపు రంగులోకి మారడాన్ని పామర్ ఎరిథెమా అంటారు. కాలేయం దెబ్బతినడం వల్ల హార్మోన్లలో మార్పులు సంభవించి.. అరచేతులు ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది. అలాగే గోళ్లు పసుపు రంగులోకి మారడం కూడా కాలేయ అనారోగ్యానికి సంకేతం.
పాదాల దురద..
లివర్ దెబ్బతినడం వల్ల రక్తంలో బిలిరుబిన్ వంటి విషపదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది చర్మంపై తీవ్రమైన దురదను కలిగిస్తుంది. అరికాళ్ళ పై ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
చర్మం రంగులో మార్పు
కాలేయం అనారోగ్యానికి గురైనప్పుడు.. దాని పనితీరు మందగిస్తుంది. దీని వల్ల రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో మీ కళ్ళలోని తెల్లసొన, చర్మం, మీ పాదాల పసుపు రంగులో కనిపిస్తాయి. కామెర్లు అని పిలువబడే ఈ పరిస్థితి కాలేయ సమస్యకు ప్రధాన సంకేతం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.