/rtv/media/media_files/2025/10/19/health-2025-10-19-11-18-16.jpg)
health
Health: నేటి బిజీ బిజీ లైఫ్ లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు 24 గంటలు కంప్యూటర్ల ముందు కూర్చొని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరైన సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం, బ్రేక్ లేకుండా వర్క్ చేయడం వంటి పొరపాట్లు చేస్తారు. ఇలా మనం చిన్నవిగా భావించే ఈ అలవాట్లే ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. మన ఆరోగ్యానికి హానీ కలిగించే కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం..
కొంతమంది పని హడావిడిలో పడిపోయి బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం చేస్తుంటారు. ఇలా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. అలాగే శక్తి తగ్గిపోయి.. రోజంతా కూడా నీరసంగా ఉంటుంది. ఈ అలవాటు దీర్ఘకాలంలో కొనసాగితే ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎక్కువసేపు కూర్చోవడం
పని చేసేటప్పుడు కొందరు గంటలు గంటలు ఒకే చోట కూర్చుండి పోతారు. పనిలో అయినా, ఇంట్లో అయినా నిరంతరం ఒకే చోట కూర్చోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, వెన్ను నొప్పి వస్తాయి. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం లేదా కాస్త వాకింగ్ చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయి.
చెడు భంగిమ
పని చేసేటప్పుడు మన శరీర భంగిమ అనేది చాలా ముఖ్యమైనది. వెన్నెముకను నిటారుగా ఉంచి పని చేసుకోవాలి. వాలడం లేదా చెడు భంగిమ వెన్నెముకపై ప్రభావం చూపుతుంది. ఇది వెన్నునొప్పిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
మొబైల్ ఫోన్ వాడకం..
గంటల తరబడి ఫోన్ చూడడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. అంతేకాదు ఇది నిద్రకు అవసరమయ్యే మెలటోనిన్ హార్మోన్ ను తగ్గిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి, జీవక్రియ, మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
డీహైడ్రేషన్
ప్రతి రోజూ 7-8 గ్లాసుల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, ఆఫీసుల్లో కొంతమంది పనిలో పడిపోయి సరిగ్గా నీళ్లు తాగకపోవడం చేస్తుంటారు. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీ సమస్యలు, చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఆలస్యంగా నిద్రపోవడం
చాలా మంది ఐటీ ఉద్యోగులు రాత్రిళ్ళు ఆలస్యంగా పడుకోవడం చేస్తుంటారు. ఆలస్యంగా నిద్రపోవడం జీవక్రియ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది.
ఒత్తిడి
దీర్ఘకాలిక ఒత్తిడి అధిక రక్తపోటు, గుండె సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి వర్క్ మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: Chings Add: వామ్మో.. రూ. 150 కోట్లతో యాడ్ షూటా! అట్లీ డైరెక్షన్ లో శ్రీలీల, రణ్‌వీర్ సింగ్!
Follow Us