టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ కామన్ అయిపోయింది. మొబైల్ ఫోన్స్ చాలా లాభాలు ఉన్నప్పటికీ.. సరైన విధంగా వాడకపోతే మాత్రం దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం.
చాలా మంది మొబైల్ ఫోన్లను జేబులో ఎక్కువగా పెట్టుకోవడం చేస్తుంటారు. కానీ మొబైల్ ఫోన్ జేబులో పెట్టుకోవడం ఆరోగ్యానికి చాలా హాని అని చెబుతున్నారు నిపుణులు. ప్యాంట్ జేబులో ఉంచడం లైంగిక సమస్యలకు కూడా దారి తీస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. అసలు దీనిపై వైద్య నిపుణులు, నివేదికలు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
హెల్త్ సైట్ నివేదిక ప్రకారం.. మానసిక ఒత్తిడి నుంచి బ్రెయిన్ సమస్యల వరకు అన్ని రకాల ఆధునిక వ్యాధులకు మొబైల్ ఫోన్లు కారణమని ఓ అధ్యయనం తెలిపింది. ఆస్ట్రియా, ఈజిప్ట్ వైద్య పరిశోధకులు ప్రచురించిన నివేదికలో నిరంతరం మొబైల్స్ తో గడపడం 'అంగస్తంభన' అంటే సెక్స్ సమస్యకు కారణమవుతుందని చెప్పారు. పరిశోధకులు 6 సంవత్సరాల వ్యవధిలో రెండు పురుష సమూహాలను అధ్యయనం చేసిన తర్వాత నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఈ పరిశోధనలో మొదటి గ్రూప్ లోని 20 మంది పురుషులు లైంగిక సమస్యలతో బాధపడుతుండగా, రెండవ గ్రూప్ లోని తమకు ఎలాంటి లైంగిక సమస్యలు లేవని చెప్పారు. దీని ప్రకారం మొబైల్ ఫోన్స్ జేబులో ఉంచడం లైంగిక సమస్యలకు కారణమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది.
మొబైల్ ఫోన్ ను జేబులో ఉంచినప్పుడు.. శరీరం 2 నుంచి 7 రెట్లు రేడియేషన్ను అనుభవించాల్సి వస్తుంది. ఈ రేడియేషన్స్ కారణంగా DNA నిర్మాణాన్ని ప్రభావితమై నపుంసకత్వానికి ( impotence) దారితీసే ప్రమాదం ఉంది.
అంతేకాదు మొబైల్ రేడియేషన్స్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.