Life Style: కంటి ఒత్తిడికి '10-10-10' రూల్.. ఒక్కసారి ట్రై చేయండి

ఈ రోజుల్లో మనం ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టీవీలను చాలాసేపు చూస్తున్నాం. దీనివల్ల మన కళ్ళు అలసిపోవడం, ఒత్తిడికి గురవడం సర్వసాధారణమైపోయింది. దీనికి ఒక సింపుల్ పరిష్కారం ఉంది: '10-10-10' నియమం!

New Update
Eye Strain

Eye Strain

Life Style:  ఈ రోజుల్లో మనం ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టీవీలను చాలాసేపు చూస్తున్నాం. దీనివల్ల మన కళ్ళు అలసిపోవడం, ఒత్తిడికి గురవడం సర్వసాధారణమైపోయింది. కళ్ళు పొడిబారడం, తలనొప్పి రావడం, కళ్ళు మంటలు పుట్టడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికి ఒక సింపుల్ పరిష్కారం ఉంది: '10-10-10' నియమం! ఇది చాలా సులభమైన  నియమం! అంతేకాదు  మీ కళ్ళకు విశ్రాంతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది.

అసలు '10-10-10' రూల్  అంటే ఏంటి ?

ప్రతి 10 నిమిషాలకు  బ్రేక్ 

మీరు ఏదైనా స్క్రీన్ (ఫోన్, కంప్యూటర్, టీవీ) చూస్తున్నప్పుడు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుంచి బ్రేక్ తీసుకోండి. ఇలా చేయడం ద్వారా కంటికి విశ్రాంతి దొరుకుతుంది. 

10 అడుగుల దూరం

మీ నుంచి 10 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును చూడండి. అది గోడపై ఉన్న పెయింటింగ్ కావచ్చు, కిటికీలోంచి కనిపించే చెట్టు కావచ్చు లేదా గదిలోని ఏదైనా వస్తువు కావచ్చు. అలా 10 సెకన్ల పాటు ఆ వస్తువును తదేకంగా చూడండి. ఇలా చేయడం వల్ల మీ కళ్ళ కండరాలు దగ్గరి వస్తువులపై దృష్టి పెట్టడం నుంచి విశ్రాంతి పొందుతాయి. అలాగే ఇది కళ్ళ ఒత్తిడిని తగ్గిస్తుంది. 10 నిమిషాల బ్రేక్, 10 అడుగుల దూరం, 10 సెకన్లు చూడడమే '10-10-10' రూల్. 

ఎందుకు ఈ నియమం అవసరం?

మనం స్క్రీన్‌లను చూస్తున్నప్పుడు, మన కళ్ళు చాలా దగ్గరగా ఉండే చిన్న అక్షరాలపై లేదా చిత్రాలపై దృష్టి పెడతాయి. దీనికోసం కంటిలోని కండరాలు నిరంతరం పనిచేయాలి. ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల కండరాలు అలసిపోయి కళ్ళకు ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో  '10-10-10' రూల్  ఒత్తిడిని తగ్గించి, కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. అలాగే  కళ్ళు పొడిబారకుండా, తలనొప్పి రాకుండా కూడా సహాయపడుతుంది.

ఎవరికి ఉపయోగపడుతుంది?

ఆఫీసులో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చునేవారికి ఇది చాలా ముఖ్యం. అలాగే   స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఎక్కువగా వాడేవారంతా ఈ నియమాన్ని పాటించాలి. వీరితో పాటు వీడియో గేమ్స్ ఆడే పిల్లలు, పెద్దలు కూడా ఈ నియమాన్ని పాటిస్తే కళ్ళకు మేలు జరుగుతుంది. '10-10-10' నియమం మీ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక సులువైన, సమర్థవంతమైన మార్గం. దీన్ని మీ రోజువారీ అలవాటులో భాగం చేసుకోండి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు