/rtv/media/media_files/2025/05/01/qQlUtNQC5RQ0H4Vn7nMx.jpg)
foods that cause microwave blast
Microwave Oven: ఒకప్పుడు ఎక్కడో ఒక ఇంట్లో మాత్రమే మైక్రోవేవ్ లు కనిపించేవి. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో మైక్రోవేవ్ కామన్ వస్తువుగా మారిపోయింది. అయితే చాలా మందికి దీనిని సరైన పద్దతిలో వాడడం తెలియదు. తెలిసి, తెలియక చేసే పనుల కారణంగా మైక్రోవేవ్ లు పేలి.. ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. మైక్రోవేవ్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏ వస్తువులను మైక్రోవేవ్ లో పెట్టకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
ఏ వస్తువులు, పదార్థాలు పెట్టకూడదు..
గుడ్లు
గుడ్లను మైక్రోవేవ్ లో అస్సలు ఉడకబెట్టరాదు. అయితే గుడ్డు ఉడికించేటప్పుడు మైక్రోవేవ్ లో ఆవిరి ఏర్పడుతుంది. ఈ ఆవిరి ఎక్కువైనప్పుడు.. లోపల ప్రెజర్ పెరిగిపోయి గుడ్డు పేలిపోవచ్చు. ఇది మైక్రోవేవ్ పేలడంతో పాటు విద్యుత్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది.
నీరు
చాలా మంది నీటిని త్వరగా వేడి చేయడానికి మైక్రోవేవ్ ఉపయోగిస్తారు. కానీ ఇలా చేసేటప్పుడు మైక్రోవేవ్ నుంచి నీరు బయట పడే అవకాశం ఉంది. ఇది పరికరాన్ని డ్యామేజ్ చేయడంతో పాటు.. ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది.
ఆలు గడ్డలు
గుడ్ల మాదిరిగానే ఆలు గడ్డలు కూడా మైక్రోవేవ్ లో ఉడకబెట్టవద్దు. వీటిని ఉడికించేటప్పుడు ఏర్పడే ఆవిరి కారణంగా లోపల ప్రెజర్ పెరిగిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది.
/rtv/media/media_files/2025/05/01/4tIzv3HtLjrPUWTpaeN3.jpg)
అల్యూమినియం ఫాయిల్
అల్యూమినియం ఫాయిల్‌ను మైక్రోవేవ్‌లో ఉపయోగించకూడదు. ఎందుకంటే మైక్రోవేవ్ ఉపరితలం, అల్యూమినియం ఫాయిల్ రెండూ.. లోహంతో చేయబడి ఉంటాయి. దీని కారణంగా రాపిడి పెరిగి నిప్పు అంటుకునే అవకాశం ఉంది. ఇది పేలుడు ప్రమాదానికి దారితీస్తుంది.
లిడ్స్
సాధారణంగా మైక్రోవేవ్ లో ఏదైనా వేడి చేసేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెట్టడం ద్వారా గిన్నెలో ప్రెజర్ పెరిగిపోయి పేలిపోవచ్చు. ఇది మైక్రోవేవ్ పేలడానికి దారితీస్తుంది.
స్టీల్, రాగి..
స్టీల్, రాగి, ఇనుముతో తయారు చేసిన పాత్రలను కూడా మైక్రోవేవ్ లో పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే వీటి మెటల్ ఉపరితలాలు మైక్రోవేవ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ వేవ్స్ లోపల వేడిని పెంచి.. అగ్నికి దారితీయవచ్చు. కావున మైక్రోవేవ్-సేఫ్ ప్లాస్టిక్ లేదా గ్లాసు పాత్రలను ఉపయోగించండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
elugu-news | life-style